Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ ఖమ్మం సభ సవాళ్లు …

బీఆర్ యస్ ఖమ్మం సభ సవాళ్లు
తెలంగాణా రాష్ట్ర మోడల్ దేశమంతా అంటున్న గులాబీ బాస్
ఆలోచన మంచిదేఆచరణ సాధ్యమేనా అంటున్న విశ్లేషకులు
రైతు బంద్ ,24 గంటల విద్యుత్ అమల్లో మంచి మార్క్ లే
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లో అవినీతి మరకలు..?
డబల్ బెడ్ రూమ్ ఇల్లు వాగ్దానంలో విఫలమని విమర్శలు
దళిత బంద్ లోను వెనకడుగు దిశగా ఆలోచనలని ఆరోపణలు
బీసీ ,ఎస్టీ బంద్ అమలుచేయాలని డిమాండ్
రైతుబంద్ భూస్వాములకు , ఇన్ కం టాక్సీ హోల్డర్లకు ఇవ్వడంపై వెల్లు ఎత్తుతున్న విమర్శలు
నిజమైన లబ్దిదార్లుకు పథకాలు అందడంలేదని అభియోగాలు

 

ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ యస్ సభ దేశానికి ఒక దశ దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. అయితే అది అంతా తేలిక కాదు . బీఆర్ యస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో బీజేపీ ,కాంగ్రెస్ ను కాదని ప్రాంతీయ పార్టీలను కూడ గట్టే శక్తి బీఆర్ యస్ కు ఉంటుందా ? ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ నేతగా ఉన్న కేసీఆర్ రేపు జాతీయ పార్టీని లీడ్ చేయాల్సి వచ్చినప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికి ఒక్క ఏపీలో మినహా రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చేయలేదు . 13 పార్టీలు బీఆర్ యస్ లో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు . ఇప్పటికైతే బీఆర్ యస్ చాల మైలు రాళ్లను దాటాల్సి ఉంది .

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన మొనగాడిగా నిలిచిన కేసీఆర్ రాష్ట్రంలో తన ఆలోచనలకు అనుగుణంగా కొన్ని మంచి పనులు చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు .అయితే చేసిన పనులు చెప్పుకోవడంలో కూడా తప్పులేదు . కానీ ఇంకా రాష్ట్రానికి చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నీళ్లు ,నిధులు , నియామకాలు అన్న కేసీఆర్ అవి పాక్షికంగానే సాధించిన విషయాన్నీ కావాలనే పక్కన పెడుతున్నారా ?.అనే భావన కలుగుతుంది . బంగారు తెలంగాణ అన్న మాటలు సాకారం కాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పేదల బతుకులు బాగుపడలేదు .అందువల్ల సాధించిన విజయాలతో సంతృప్తి పడితే లాభం లేదు . దేశంలో అనేక రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది . దానికి అనేక చారిత్రిక కారణాలు ఉన్నాయి. హైద్రాబాద్ మొదటి నుంచి ధనిక నగరమే . దానికి తోడు రాష్ట్రాన్ని పాలించిన పాలకులు కూడా హైద్రాబాద్ ను అభివృద్ధి చేసేందుకు తమ శాయశక్తులా కృషిచేశారని చెప్పడంలో ఎలాంటి శషభిషలు అవసరంలేదు . పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎన్టీఆర్ , పరిపాలన గాడిలోపెట్టి శహబాస్ అనిపించుకున్న జలగం వెంగళరావు , డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి,ఐటీని,ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసిన , చంద్రబాబు నాయుడు , తెలంగాణ కావాలని ప్రత్యేక పార్టీ పెట్టిన మర్రి చెన్నారెడ్డి లాంటి అనేక మంది కృషి ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తూ అభివృద్ధి చేయడంలో కేసీఆర్ పాత్ర కాదనలేము . అందుకు కేసీఆర్ ను అభినందించాల్సిందే . కానీ అభివృద్ధికి అంతటికి తానే కారణమని ఎవరు చెప్పుకున్నా అది అతిశయోక్తి అవుతుంది. అభివృద్ధి కోసం తపన పడటం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించడంలో కేసీఆర్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు .

టీఆర్ యస్ అంటేనే రాష్ట్రంకోసం పుట్టిన పార్టీగా కేసీఆర్ భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడు కున్న పార్టీ . తమపార్టీ టీఆర్ యస్ అని ప్రజలు ఓన్ చేసుకున్నారు . ఉద్యమంలో కేసీఆర్ ఓడిపోతే రాష్ట్రం కోల్పోతామని సబ్బండ వర్గాలు భావించాయి. అందుకే సకల జనుల సమ్మె , మిలియన్ మార్చ్,కళాకారుల దుందాం లాంటి కార్యక్రమాలు ఉద్యమాన్ని ఉర్రుతలూగించాయి. తెలంగాణ సెంటిమెంట్ ను నిలబెట్టి కలబడ్డాయి . ఉద్యమంలో అనేక వందల మంది యువకులు ,విద్యార్థులు అసువులు బాశారు . వారికీ శాల్యూట్ చేయాల్సిందే …. ఆశయాలకోసం వారు అసువులు బాశారో వాటిని సాదించాలి . అందుకు ఉద్యమనాయకుడుగా ఉన్న కేసీఆర్ కృషిని కొనసాగించాలి ….

బీజేపీ వర్సెస్ బీఆర్ యస్

రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కేంద్రంలో ఉన్న బీజేపీ నిరంకుశ , నియంత, విచ్చిన్నకర విధానాలపై విసుగు చెందారు . అంతకు ముందు బీజేపీతో కలిసి నోట్ల రద్దు , జీఎస్టీ లాంటి నిర్ణయాలు సమర్థించిన కేసీఆర్ రాష్ట్రాలపై కేంద్రం గవర్నర్ల ద్వారా పెత్తనం చేయడంపై సహించలేకున్నారు . అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడంపై విభేదించారు . ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు . రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు .

బీజేపీ పై విధానాలను ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ పార్టీ పెట్టి దేశమంతా తెలంగాణ మోడల్ పరిపాలన అందిస్తానని ప్రకటించారు . ఫలితంగా టీఆర్ యస్ స్థానే బీఆర్ యస్ వచ్చింది. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా రిజిస్టర్ అయింది . ఇంకా జాతీయ పార్టీ గుర్తింపు రాలేదు . జాతీయ పార్టీ గుర్తింపు రావాలంటే ఎన్నికల సంఘం నిబంధలను తూ .. తప్పకుండ పాటించాలి

మొదటి సభ ఖమ్మం గుమ్మంలో జరగబోతుంది . దీనిపై కేసీఆర్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు . భారీ జనసమీకరణతో తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు . దీనికి తనతోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు ,మాజీ సీఎం అఖిలేష్ , సిపిఐ ,సిపిఎం నాయకులను ఆహ్వానించారు . 18 ఉదయం ప్రగతి భవనంలో సీఎంలు సభకు వచ్చే ఇతర నాయకులతో సమావేశమై కేసీఆర్ తన ఆలోచనలను వారితో పంచుకుంటారు .

అనంతరం సిపిఐ ,సిపిఎం నాయకులతోపాటు కేసీఆర్ సారథ్యంలో రెండు హెలీకాఫ్టర్లలో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనం చేయించుకొని అక్కడ నుంచి ఖమ్మం సభకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు . దేవుళ్ళు అంటే దూరంగా ఉండే సిపిఐ ,సిపిఎం నేతలు కేసీఆర్ యాదాద్రి ఆహ్వానాన్ని అంగీకరించారా? ఒక వేళ వారి అంగీకరిస్తే తప్పు కాకపోయినా వార్త మాత్రం అవుతుంది.

Related posts

తుమ్మలే పెద్ద ద్రోహి …కందాల అనుచరులు ఘాటు వ్యాఖ్యలు!

Drukpadam

రోశయ్య ను హింసించారు … వీహెచ్ హాట్ కామెంట్స్!

Drukpadam

ఆరాతీయడమే జర్నలిస్ట్ ల వృత్తి …ఆరాధించడం కాదు మంత్రి గారు ….

Drukpadam

Leave a Comment