బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపు!

బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపు!
-2024 జూన్ వరకు నడ్డా పదవీకాలం కొనసాగింపు
-ఈ ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం
-నడ్డా నాయకత్వంలో మంచి విజయాలను సాధించామన్న అమిత్ షా
-పశ్చిమ బెంగాల్ , తెలంగాణాలో బలపడ్డామన్న షా

బీజేపీ జెపి నడ్డా నాయకత్వ పటిమపై విశ్వాసం ఉంచింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు నడ్డా నాయకత్వంలోనే వెళతామని పార్టీ ప్రకటించింది . నడ్డా కాలంలో పార్టీ అనేక విజయాలు సంధించిన విషయాలను ఇటు ప్రధాని మోడీ , అటు అమిత్ షా లు సమావేశంలో ప్రస్తావిస్తూ ఆయనపై ప్రసంశలు కురిపించారు . అందువల్ల ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని పెట్టడం కన్నా దేశంలో అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న జెపి నడ్డాను కొనసాగించడమే మంచిదని బీజేపీ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు . అందుకు అనుగుణంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. 2024 జూన్ వరకు పార్టీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ ఈరోజు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.

ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అత్యంత ముఖ్యమైన లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డాను కొనసాగించాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ… నడ్డా అధ్యక్షతన 2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నడ్డా నాయకత్వంలో మంచి విజయాలను సాధించామని… తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమయిందని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: