Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీకో హటావో …దేశ్ కి బచావో … ఖమ్మం బీఆర్ యస్ సభలో కేసీఆర్  పిలుపు …

బీజేపీకో  హటావోదేశ్ కి బచావోఖమ్మం బీఆర్ యస్ సభలో కేసీఆర్  పిలుపు
ఖమ్మం బీఆర్ యస్ బహిరంగ సభలో బీజేపీ విధానాలపై నిప్పులు చెరిగిన నేతలు
ప్రజల కష్టాలు తీర్చని బీజేపీ విధానాలు దేశానికి అవసరమా?
సంపన్న భారత్ ను నిర్మించుకుందాం
బీఆర్ యస్ పాలన వస్తే దేశమంతా రైతుబంధు ,24 గంటలు విద్యత్
మీది ప్రవేట్ బాటమాది జాతీయం మాట సీఎం కేసీఆర్
ఎల్ సి ని, విశాఖ ఉక్కును ప్రవేట్ చేస్తే మేము జాతీయం చేస్తాం
బీజేపీ విచ్చిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యమవుదాం
స్వయం పోషక భారతాన్ని నిర్మించడమే బీఆర్ యస్ లక్ష్యం

ఖమ్మంలో బీఆర్ యస్ సభకు హజరైన ప్రజలు

బీజేపీకో హటావోదేశ్ కి బచావో నినాదంతో ఖమ్మం లో జరిగిన బీఆర్ యస్ మొదటి ప్రజా గర్జన సభలో నలుగురు ముఖ్యమంత్రులు , ఇద్దరు జాతీయ నేతలు పిలుపు నిచ్చారు . బీజేపీ పరిపాలనపై సూటిగా సుత్తిలేకుండా నిప్పులు కురిపించారు . బీజేపీ విధానాలపై వాడివేడిగా ధ్వజమెత్తారు . బీజేపీ పాలన వల్ల దేశం అన్ని రంగంగాల్లో విఫలమైందని బీఆర్ యస్ అధ్యక్షుడు , సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు . నీళ్లు సమృద్ధిగా ఉండి,కావాల్సినంత భూమి ఉండి సహజ సంపదలతో సుభిక్షంగా ఉండాల్సిన దేశాన్ని భిక్షమెత్తుకునేలా చేసిన బీజేపీ , కాంగ్రెస్ విధానాలను కేసీఆర్ తూర్పారబట్టారు . మన పాలకుల చేతకాని తనం వల్ల దేశం అప్పులపాలు అవిందని ,నిరుద్యోగం , నిరక్షరాస్యత , తాండవిస్తుంది ఇదేనా మనం కోరుకున్న విముక్తి అని బీజేపీ , కాంగ్రెసులకు కేసీఆర్ తనదైన శైలిలో చురకలంటించారు. దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉండగా సాగు అవుతున్న భూమి కేవలం 41 కోట్లేనని వివరించారు . లక్ష 40 వేల టీఎంసీ నీరు లభ్యమవుతుండగా 70 శాతం ఆవిరి అవుతుందని అన్నారు . తినే ఆహారం కల్తీ , తాగే నీరు కల్తీ , మెక్ డోనాల్డ్ పీజ్జాలకు , బర్గర్లకు అలవాటుపడ్డామని మంచి ఫుడ్ దొరకాల్సిన చోట కల్తీలు రాజ్యమేలుతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు . మన పెద్దలు చెప్పినట్లు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కులను హరిస్తుందని ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని , ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లను ఉసిగొల్పి రాష్ట్రాలను నిర్వహిర్యం చేసే కుట్ర జరుగుతుందని మండి పడ్డారు .

మనదేశంలో ఇప్పటికి వందల టీఎంసీ డిజైన్ గల ప్రాజెక్టులే ఉన్నాయని వివిధ దేశాల్లో వేల టీఎంసీ సామర్థ్యం గల ప్రాజక్టులను నిర్మించిన విషయాన్నీ గుర్తు చేశారు . మనదగ్గర బకెట్ నీళ్ల కోసం యుద్దాలు చేయాల్సి వచ్చేదని దాన్ని నివారించేందుకు మిషన్ భగీరథ తెచ్చామని బీఆర్ యస్ దీన్ని దేశమంతా అమలు జరుపుతుందన్నారు . దేశమంతా రైతు బందు , ఉచిత కరెంటు , దళిత బందు అమలు చేస్తామని ,పబ్లిక్ రంగాన్ని పటిష్టం చేస్తామని కేసీఆర్ సభ సాక్షిగా హామీ ఇచ్చారు .మోడీ మేక్ ఇన్ ఇండియా , జోక్ ఇన్ ఇండియా గా మారిందని ఇండియా శక్తిని ప్రపంచానికి చాటటడమే తమ లక్ష్యమని కేసీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు . అగ్నిపథ్ ను రద్దు చేస్తామని , నిరుద్యోగులకు ఉద్యాగాలు , ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం , స్వయం పోషక భారతాన్ని నిర్మించడమే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని కేసీఆర్ సభికుల హర్హద్వానాల మధ్య ప్రకటించారు .

బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టడానికి కారణం ఇదే: సీఎం కేసీఆర్‌

ఖమ్మం సభ ద్వారా బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టడానికి గల కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు. ” జింబాంబ్వే అనే దేశంలో 6,533 టీఎంసీల రిజర్వాయర్‌ జాంబేజీ నది మీద ఉంది. రష్యాలో అంగారా నది మీద 5,968 టీంఎసీల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5085 టీఎంసీల ప్రాజెక్టు, కెనడాలో మనీకూగాన్‌ నది మీద 4944 టీంఎసీల ప్రాజెక్టు , ఈజిప్టులో నైలు నది మీద 4500 టీఎంసీల ప్రాజెక్టు, చైనాలో యాంగ్జీ నది మీద 1400 టీఎంసీల ప్రాజెక్టు.. అమెరికాలోని కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మరి మన దేశానికి ఏమైంది. ? సువిశాల దేశం.. 139 కోట్ల జనాభా.. కరువులు చూసినం, కాటకాలు చూసినం.. వరదలు చూస్తున్నం.. ఇలాంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా వద్దా మన మొఖానికి.. మనం నోసుకోలేదా.. ఇప్పటికీ మంచినీళ్లకు బాధపడాలా.. సరైన పరిపాలన వచ్చి.. నదుల నీళ్లు భూమ్మీదకు మళ్లి.. ప్రజల దాహం.. పొలాల దాహం తీర్చాల్నా.. మనం సన్నాసులెక్క ఇట్లే ఉండాల్నా? దయచేసి దేశం ఆలోచించాలి అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఖమ్మం సభ ద్వారా దేశాన్ని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రశ్నించడానికి.. చైతన్యం తేవడానికి.. దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్‌ఎస్‌ పార్టీ అని ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Related posts

ఇటు బీఆర్ యస్ ….అటు బీజేపీ మహిళల పేరుతో పోటాపోటీ ధర్నాలు …

Drukpadam

కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే నాతోనే సాధ్యం… శశిథరూర్ …!

Drukpadam

అబద్ధాల పోటీలో  చంద్రబాబు ఫస్ట్ ప్రైజ్ కు ఎంపికైనట్టే…విజయసాయిరెడ్డి

Drukpadam

Leave a Comment