బీఆర్ యస్ ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సాధించింది ఏమిటి ?

బీఆర్ యస్ ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సాధించింది ఏమిటి ?
-కొంతకాలం క్రితం రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్
-రాజ్యాంగాన్ని బీజేపీ సమూలంగా మార్చాలని చూస్తుండడం పై సభలో పాల్గొన్న నేతల విమర్శలు
-మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని బీజేపీ చేస్తున్న కుట్రలను -తిప్పికొట్టాల్సిన అవసరాన్ని వివరించిన నేతలు
-ఖమ్మం బీఆర్ యస్ సభలో పాల్గొన్న సీఎంలు జాతీయ నేతలు

బీఆర్ యస్ ఏర్పాటు చేసిన తర్వాత ఖమ్మం లో మొదటి సభ పెట్టిన కేసీఆర్ ఏమి సాధించారు …? ప్రజలకు ఏమి సందేశం ఇచ్చారనేది సహజంగానే ఎవరికైనా వచ్చే సందేహం .. దీనిపై ఠకీమని జవాబు చెప్పే పరిస్థితి లేదు …అయితే ఖమ్మం జిల్లాకు కొన్ని మేళ్లు జరిగాయనే చెప్పవచ్చు … గ్రామ పంచాయతీలకు నిధులు , కార్పొరేషన్ కు , మున్నేరు పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి మంజూరి , యూనివర్సిటీ , ప్రభుత్వ ఇంజనీరీంగ్ కాలేజీ లు రావడం మంచి పరిణామం ..

ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించారు . కంటి వెలుగు రెండవ దశ అట్టహాసంగా ప్రారంభించారు . అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు . అందులోను బీజేపీ వ్యతిరేకంగా పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎలాంటి కామన్ అండర్ స్టాండింగ్ ఉన్నట్లు కనిపించలేదు . కేసీఆర్ పథకాలు మిగతా రాష్ట్రాల సీఎం లు మెచ్చుకున్నారు. ఆ పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని సీఎం లు చెప్పారు .ఇంతవరకు ఒకే …మరి సభ సంధించింది ఏమిటి ? కామన్ ప్రోగ్రాం ప్రకటించలేదు. ఖమ్మం డిక్లరేషన్ లేదు … మిగత రాష్ట్రాల్లో కూడా కలిసి సభలు పెడతామని ప్రకటించలేదు .

సభకు బీఆర్ యస్ నేతలు అనుకున్నట్లు 5 లక్షల మంది జనం రాకపోయినా భారీ సమీకరణ జరిగింది. సభలో ప్రసంగాలు ఎవరో తరిమినట్లు ఉన్నాయి తప్ప ప్రజలకు తమ విధానాలు వివరించేందుకు ఉపయాగపడలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . కేసీఆర్ తోపాటు వచ్చిన సీఎంలు, అతిధులు వేదిక మీదకు రాకముందే సిపిఐ ,సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు , తమ్మినేని వీరభద్రం ప్రసంగాలు ముగిశాయి. వారిని కూడా సీఎంలు అతిధులు వస్తున్నారు కాబట్టి తొందరగా ముగించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదేపదే చెప్పడం కనిపించింది . తర్వాత కూడా తనకు అర్జెంట్ పని ఉన్నదని కేరళ సీఎం పినరాయి విజయన్ ముందుగానే మాట్లాడి వెళ్లారు . అయితే ఆయన చేసిన ఆంగ్ల ప్రసంగానికి తెలుగు అనువాదం లేకపోవడం వచ్చిన ప్రజలకు ఆయన ఏమి చెప్పారో అర్థం కాకుండా పోయింది . మిగతా సీఎంలు కేజ్రీవాల్ ,భగవంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు కూడా వారి ప్రసంగాలను హిందీలో చేశారు . వారు చెప్పిన విషయాలు బాగా ఉన్నప్పటికీ ప్రజలకు అర్థం కాకపోవడంతో తెల్ల మొఖాలు వేశారు .ఇక సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా ఇంగ్లీష్ లో చేసిన ప్రసంగం ఉత్తేజకరంగా ఉన్నా ప్రజలకు అనువాదం చేస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

కొంతకాలం క్రితం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చాలని అనడం విమర్శలు దారి తీసింది . అయితే సభలో పాల్గొన్న మిగతా సీఎం లు నేతలు రాజంగాన్ని కాపాడుకోవసిన ఆవశ్యకత ,బీజేపీ దానికి తూట్లు పొడుస్తున్న తీరు పై ధ్వజమెత్తారు . ఒకరకంగా చెప్పాలంటే రాజ్యాంగం జోలికొస్తే తాట తీస్తామని చెప్పారని అభిప్రాయాలు కలిగాయి. 

కేసీఆర్ ప్రసంగం మొదలు పెట్టి కొన్ని విషయాలు చెప్పేసరికి హెలికాఫ్టర్ టేక్ ఆఫ్ కావాలంటే వెలుగు ఉండాలని సంకేతాలు రావడంతో” గీ” హెలీకాఫ్టర్లతో ఇదే లొల్లి అంటూ ఆయన మధ్యలోనే ప్రసంగాన్ని ముగించి వెళ్లాల్సి వచ్చింది. దూరా భారం నుంచి అనేక వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చిన అతిధులు , వివిధ ప్రాంతాల నుంచి సమీకరించిన ప్రజలకు ఈసభ సంతృప్తి కలిగించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Leave a Reply

%d bloggers like this: