కాంగ్రెస్ లో లొల్లి… కార్యకర్తల పరేషాన్ …

కాంగ్రెస్ లో లొల్లి… కార్యకర్తల పరేషాన్ …
-కోమటిరెడ్డి పై కొండా సురేఖ ఫైర్…
-పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ డిమాండ్
-కోమటిరెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని వ్యాఖ్య
-అందరం కలిసి పని చేయకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న సురేఖ
-వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడొద్దన్న రేవంత్
-ఇంచార్జి ఠాక్రే సైతం సురేఖ మాటల పట్ల అసహనం …

అందరం కలిసి పని చేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయిందని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి ఐకమత్యంతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని… ఆయనను పార్టీ నుంచి సస్సెండ్ చేయాలని అన్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. సమావేశం అజెండాలో ఉన్న అంశాలపైనే మాట్లాడాలని… వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. గాంధీభవన్ లో ఈరోజు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లో ఉన్న అనైక్యతను తొలగించి రానున్న ఎన్నికల్లో ముందుకు సాగాలని ఒక పక్క అధిష్టానం ప్రయత్నం చేస్తుండగా ఇక్కడ నాయకులూ మాత్రం కాంగ్రెస్ ను బలహీన పరిచి ప్రత్యర్థులకు బలం చేకూర్చే చర్యలకు పాల్పడుతుందని అభిప్రాయాలూ కలుగు తున్నాయి. అందుకు తగ్గట్లుగానే వారి వ్యవహారశైలి ఉంటుంది . గాంధీ భవనం లో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో పార్టీ ఇంచార్జి మాణిక్ రావు థాకరే పాల్గొన్నారు . ఈ సందర్భంగా కొండా సురేఖ పెట్టిన మంటలు కొత్త పంచాయతీకి దారి తీశాయి. ఆమె ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి పై ధ్వజమెత్తారు . ఆయన చర్యలవల్లనే మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోయిందని ఆయన్ను సస్పండ్ చేయాలనీ అనడం అప్రస్తుతం అనే అభిప్రాయాలు ఉన్నాయి. బలమైన నాయకులను పార్టీ నుంచి పోకుండా చూడాలనే ఉద్దేశంతో నూతన ఇంచార్జి ఠాక్రే నాయకులను బుజ్జగిస్తుండగా సురేఖ లాంటి నాయకులూ అప్రస్తుతతం అయినా వాటిని మాట్లాడటం ఏ ఐక్యత కోసమనే అభిప్రాయాలు ఉన్నాయి.

హాథ్ సే హాథ్ జోడో లో కలిసి కట్టుగా పాల్గొనండి …ఠాక్రే

సమావేశంలో పాల్గొన్న ఇంచార్జి ఠాక్రే మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగుస్తుంది .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాపితంగా చేపడుతున్న హత్ సే హత్ జోడో లో కలిసి కట్టుగా పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఠాక్రే పిలుపు నిచ్చారు . నాయకులూ కలిసి పనిచేస్తే ప్రజలు మనవెంట ఉంటారని లేకపోతె ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు . నేను ఎవరికీ అనుకూలం కాదు … వ్యతిరేకం కాదని ఠాక్రే స్పష్టం చేశారు . పార్టీ కోసం వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి అందరు కలిసి కట్టుగా పనిచేయాలని ఉద్బోధించారు . సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఇతర నాయాలు పాల్గొన్నారు .

Leave a Reply

%d bloggers like this: