Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓవైసిలోనూ సామజిక కోణం …రాజకీయాల్లో సంపన్న కులాలే ఉండటంపై ఆక్షేపణ …

ఓవైసిలోనూ సామజిక కోణం …రాజకీయాల్లో సంపన్న కులాలే ఉండటంపై ఆక్షేపణ …
-70 ఏళ్లుగా మమ్మల్ని దోచుకుంటున్నారని మండిపాటు
-గాడ్సే పై మీ వైఖరి ఏమిటి …ప్రధాని మోడీకి ఒవైసి సూటిప్రశ్న ..
-ముస్లింలను బానిసలుగా చూస్తున్నారని మండిపాటు
-అగ్రవర్ణాలవారే రాజకీయాల్లో ఉండాలనేది అన్ని పార్టీల్లో ఉందన్న ఒవైసి
-హైద్రాబాద్ లో తల్వార్ల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని పోలీస్ అధికారులకు ఒవైసి సూచన…

అసదుద్దీన్ ఒవైసి హైద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు …ఎంఐఎం అధ్యక్షులు …ఆయనకు మతతత్వ వాదిగా ముద్ర ఉంది ..అయితే ఆయనలోని సామజిక కోణం ఉందనేది ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. రాజకీయాల్లో అగ్రకులాలవారే ఉండటంపై రగిలిపోతున్నారు . ఇదేమి సామజిక న్యాయం అనే కోణంలో ఆయన ప్రశ్నించడం నిజంగా విచిత్రంగా ఉన్న ఆహ్వానించదగ్గ పరిణామం ..అంతే కాకుండా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యత్యాసాలు పోవాలని ఆయన కోరుకుంటున్నారు . అందుకు ఆయన్ను మెచ్చుకోవాల్సిందే …

దేశంలోని ముస్లింలు తమకు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీల నేతలు భావిస్తుంటారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దీన్ని తప్పకుండ ఆలోచించాలిసిందే … గత 70 ఏళ్లుగా ముస్లింలను ఇదే విధంగా దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఒక లీడర్ గా ఎదగడం రాజకీయ పార్టీలకు నచ్చదని చెప్పారు. రాజకీయాల్లో అగ్ర కులస్తులే ఉండాలనే భావన ఉందని అన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయల పార్టీలకు నచ్చదని విమర్శించారు. 

గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని… గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని మోదీని ఒవైసీ ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాను నిర్మిస్తున్నారని… ఈ చిత్రాన్ని ఇండియాలో మీరు బ్యాన్ చేస్తారా? లేదా? అని నిలదీశారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఒవైసీ ఒక విన్నపం చేశారు. నగరంలో తల్వార్లు, కత్తులతో దాడి చేస్తున్న వారిని ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. దాడులకు పాల్పడే వారికి శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒకే ఫైన్ ఇంతవరకు బాగానే ఉన్న ఆయన కూడా ఆలోచన చేసుకోవాలి .

ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి …హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో మిగతా కులాలను , మతాల వారిని ఎందుకు పోటీ పెట్టారు…? దేశంలో అనేక రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన ఎందుకు ఓట్లు అడుగుతున్నారు . బీజేపీకి లభించే విధంగా ఆయన పోటీ పెట్టి విపక్ష పార్టీలకు నష్టం చేకూర్చుతున్నారనేదానికి ఆయన సమాధానం ఏమిటి ? అనేది వెల్లడిస్తే ఆయన సామజిక కోణం నమ్మ శక్యంగా ఉంటుంది. లేకపోతె దానికి అర్థం ఉండదు …

Related posts

బీఆర్ యస్ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా ..!

Drukpadam

జగ్గుభాయ్‌ను ఇంటికి పంపే రోజు వచ్చింది: పవన్ కల్యాణ్…

Drukpadam

పాలేరుపై కందాలకు ఫుల్ క్లారిటీ…

Drukpadam

Leave a Comment