వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు: మాజీ మంత్రి బాలినేని!

వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు: మాజీ మంత్రి బాలినేని!

  • సింగరాయకొండ మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణస్వీకారం
  • హాజరైన బాలినేని శ్రీనివాసరెడ్డి
  • ఈసారి తన భార్యకు టికెట్ ఇవ్వొచ్చని వ్యాఖ్యలు
  • మహిళలకు టికెట్ ఇస్తుంటే తప్పుకోక తప్పదని వెల్లడి

ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవచ్చని అన్నారు. బహుశా తన భార్య శచీదేవికి టికెట్ ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు. నీకు సీటు లేదు… నీ భార్యకు ఇస్తాం అంటే చేసేదేమీలేదని పేర్కొన్నారు. మహిళలకు టికెట్ ఇస్తున్నప్పుడు నేనైనా తప్పుకోవాల్సిందే అని బాలినేని తెలిపారు. 

కొండపి నియోజకవర్గంలో అశోక్ బాబు అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బాలినేని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: