Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ మోసం చేశారు …కేటీఆర్ వదిలేశారు …ఇల్లందు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు…

కేసీఆర్ మోసం చేశారుకేటీఆర్ వదిలేశారుఇల్లందు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వం ఇంకా మూడు నాలుగు నెలలే ఉంటుంది
తనను ఎన్ని ఇబ్బందులు పెట్టిన నమ్ముకున్నవాళ్ళకోసం నిలబడతా
కార్యకర్తలను జైల్లో పెడితే దీక్ష చేస్తా
-2019 పార్లమెంట్ ఎన్నికల్లో తనను కాదని ఏరేపార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు
నేను పార్టీలో చేరిన సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు
గడిచిన నాలుగేళ్లలో ఖమ్మం జిల్లా ప్రజలు ఆవేదనతో ఉన్నారు..

 

ప్రజలకోసం నిలబడి వారికష్టసుఖాల్లో పాలుపంచుకున్నందుకు కక్ష్య కట్టి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనీ కేసీఆర్ చూశారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పై నేరుగా మొదటిసారి విమర్శలు గుప్పించారు . కేటీఆర్ పై నమ్మకంతో గులాబీ పార్టీలో చేరిన తనకు అడుగడుగునా పరాభవం జరిగిందని వాపోయారు . తాను ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా కేటీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ పై నమ్మకంతో టీఆర్ యస్ లో చేరానునాకు జరిగిందేమిటి ? అవమానాలు ,అన్యాయాలుతాను చేరినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి సీటు ఇస్తామని హామీ ఇచ్చారు .అవమానకరంగా ఏరేపార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని తెచ్చి సీటు ఇచ్చారు . కేసీఆర్ మోసం చేశారుకేటీఆర్ వదిలేశారునమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచడమేనా కేసీఆర్ రాజకీయాలు అని సూటిగా ప్రశ్నించారు . ప్రభుత్వం ఇంకా మూడు నాలుగు నెలలకు మించి ఉండదుతన కార్యకర్తలకు ఏమైనా జరిగితే దీక్ష చేస్తాపోలీస్ ,రెవిన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో చట్టానికి విరుద్ధంగా నడుచుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు .

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఆధ్వరంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ తనపట్ల విధంగా వ్యవరిస్తూ అవమానమరిచారో వివరిస్తూ ఇంకా ఎన్ని భాదలు పెట్టినా అరెస్ట్ చేసిజైల్లో పట్టినా ప్రజల కోసం నిలబడతానని ప్రజల జైజైల మధ్య ప్రకటించారు . రాజకీయాల్లో ఎన్టీఆర్ , డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిలను స్ఫూర్తిగా తీసుకోని ముందడుగు వేస్తాను తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు .

కేటీఆర్ తో ఉన్న పరిచయమే ఇంతకాలం పార్టీలో కొనసాగేలా చేసింది ….నన్ను జైల్లో పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.పేద ప్రజల కోసం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు దేనికైనా సిద్ధం….

అధికారం ఉందికదా అని ఏదైనా అపకారం తలపెట్టాలని చూస్తే దీటుగా ఎదుర్కొంటామని సభికుల హర్షద్వానాల మధ్య తెలిపారు
ప్రజల మేలు కోసంపని చేస్తానని ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని గద్గద స్వరంతో చెప్పారు.


చనిపోయిన ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా తన ప్రయాణం ఉంటుందని కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు .సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు , డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య ,పాయం వెంకటేశ్వర్లు , ఇతర నాయకులూ పాల్గొన్నారు .

హరిప్రియ ఫైర్

దీనిపై ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ తన స్వార్థం కోసం తిరిగి ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వదులు కుంటున్నారని విమర్శలు గుప్పించారు . ఇది ఆయన పతనానికి నాందిగా ఉంటుందని ఫైర్ అయ్యారు .

 

Related posts

బీజేపీ వైపు చూస్తున్న ములాయం సింగ్ చిన్న కోడలు!

Drukpadam

గతంలో మేం తగ్గాం… ఈసారికి మీరు తగ్గండి: టీడీపీ నేతలకు పవన్ కల్యాణ్ సూచన

Drukpadam

రాష్ట్రాల దయాదాక్షిణ్యాల వల్లే కేంద్రం బతుకుతోంది: తలసాని

Drukpadam

Leave a Comment