ముంబై విమానాశ్రయంలో పుస్తకాలలో పేజీల మధ్య కరెన్సీ నోట్లతో పట్టుబడ్డ విదేశీయుడు .. !

ముంబై విమానాశ్రయంలో పుస్తకాలలో పేజీల మధ్య కరెన్సీ నోట్లతో పట్టుబడ్డ విదేశీయుడు .. !

  • కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తున్న స్మగ్లర్లు
  • బంగారాన్ని పేస్ట్ గా మార్చి తీసుకొస్తూ పట్టుబడుతున్న వైనం
  • జైపూర్ లో సోమవారం 55 లక్షల విలువైన బంగారం పేస్ట్ స్వాధీనం

విదేశాల నుంచి డబ్బు, బంగారం, మాదకద్రవ్యాలను తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. తనిఖీలలో దొరికే అవకాశమేలేదని ధీమాగా వస్తున్నారు. అధికారులను తేలిగ్గా బోల్తా కొట్టించగలమని వచ్చి విమానాశ్రయంలో అధికారుల ముందు బోల్తా పడుతున్నారు. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. విదేశీ ప్రయాణికుడు ఒకరు పెద్ద మొత్తంలో అమెరికా డాలర్లను అక్రమంగా తీసుకొచ్చాడు.

తన వెంట తెచ్చిన పుస్తకాలలోని పేజీల మధ్య అత్యంత జాగ్రత్తగా కరెన్సీ నోట్లను దాచాడు. ఆ పుస్తకాలను తిరగేస్తే దాదాపు ప్రతీ రెండు మూడు పేజీలకు ఓ కరెన్సీ నోటు కనిపించింది. ఇలా ఆ ప్రయాణికుడు తీసుకొచ్చిన నోట్ల విలువ 90 వేల డాలర్లు అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ తనిఖీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోపక్క, సోమవారం జైపూర్ విమానాశ్రయంలో జరిపిన తనిఖీలలో షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.55 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. బంగారాన్ని పేస్ట్ గా మార్చి తాము ధరించిన ప్యాంట్ లో రహస్యంగా దాచి తీసుకొస్తున్న విషయం తనిఖీలలో బయటపడింది.

Leave a Reply

%d bloggers like this: