పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి చేతుల మీదుగా ముద్ర ఆవిష్కరణ!

పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి చేతుల మీదుగా” ముద్ర” ఆవిష్కరణ!
ముద్ర ప్రజల్లో జరగని ముద్ర వేయాలి …
సూర్యకిరణాల మాదిరిగా ప్రజాహితం కోసం కొనసాగాలి
పర్యావరణ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి
వాయిస్ లెస్ ప్యూపిల్ కు వాయిస్ గా ముద్ర…రాంనారాయణ
జర్నలిస్టుల వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి …పలువురి జర్నలిస్టుల ఆకాంక్ష …

సీనియర్ జర్నలిస్టులతో ఉన్నత లక్ష్యం కోసం ఏర్పాటు చేసిన ముద్ర దినపత్రిక, ఆన్లైన్ పేపర్, వెబ్ పేపర్, యూట్యూబ్ ఛానల్
ప్రజల్లో చెరగని ‘ముద్ర’ వేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య, జానమ్మ దంపతులు ఆకాంక్షించారు. మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో పత్రికను పరిశీలించి, ఆవిష్కరించి, మాట్లాడారు. మీడియా సూర్య కిరణల మాదిరిగా నిత్యం ప్రజాహిత జర్నలిజం కొనసాగించాలన్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ మేధావులు అంతా కలిసి ముద్ర సంస్థను స్థాపించడం స్వాగతించాల్సిన విషయమన్నారు. పర్యావరణ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని వనజివి కోరారు. ప్రకృతిని కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుందని జర్నలిస్టులు దాన్ని దృష్టిలో పెట్టుకొని వార్తలు రాయాలని కోరారు .

ముద్ర డైరెక్టర్, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,
కట్టెకోల రామనారాయణ మాట్లాడుతూ కాలానుగుణంగా దినపత్రికతో పాటు యూట్యూబ్ ఛానల్, వెభిసైట్ను ఒకేసారి ప్రారంభించుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వాయిస్ లెస్ పీపుల్ కోసం ముద్ర వాయిస్ గా ఉంటుందన్నారు. ఖమ్మం ముద్ర ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామినేని మురారి, జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు వెంకటరావు, జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, కార్యదర్శి సైదులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైస పాపారావు, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు , జిల్లా నాయకులు ఏగినాటి మాధవరావు, కోశాధికారి శివ, నామ పురుషోత్తం, వేణుగోపాల్ , జనార్ధన చారి, ఫెడరేషన్ అధ్యక్షులు కొండల్ రావు, కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, టీజేఎఫ్ నాయకులు రమేష్, సత్యనారాయణ, వివిధ మీడియా బ్యూరోలు, విలేకరులు హాజరయ్యారు.

Leave a Reply

%d bloggers like this: