నాకు పేకాట పిచ్చి …దానికోసం చైన్నై వెళ్ళేవాడిని :వైసీపీ నేత బాలినేని!

నాకు పేకాట పిచ్చి …దానికోసం చైన్నై వెళ్ళేవాడిని :వైసీపీ నేత బాలినేని!
-కానీ ఇప్పుడు కందండోయ్ ఒకప్పుడు
-ఒంగోలులో వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
-బీద మస్తాన్‌రావు తనకు టీడీపీలో ఉన్నప్పటి నుంచే పరిచయం అని గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే
-ఇద్దరం తరచూ చెన్నైలో కలుసుకునే వారమన్న బాలినేని
-మస్తాన్‌రావుకు జూదం అలవాటు లేదని వ్యాఖ్య

తనకు పేకాట జూదం అలవాటు ఉండేదని,దానికోసం తరుచు చెన్నై వెళ్లి ఆడుతుండేవాడినని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.అయితే ఇప్పుడుకందండోయ్ ఒకప్పుడు అని తన అలవాట్ల గురించి సిన్సియర్ గా అంగీకరించారు . ఇది ఒకరిద్దరి సమక్షంలో కాదు ఒంగోలులో నిన్న నిర్వహించిన వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు గురించి మాట్లాడుతూ.. ఆయన తనకు ముందు నుంచే మంచి స్నేహితుడని, టీడీపీలో ఉన్నప్పటి నుంచే పరిచయం ఉందన్నారు.

ఇద్దరం తరచూ చెన్నైలో కలుసుకుంటూ ఉండేవారమని బాలినేని అన్నారు. అయితే, తనకు జూదం ఆడే అలవాటు ఉంది కానీ, ఆయనకు లేదని చెప్పారు. తాను డబ్బులను విపరీతంగా ఖర్చు చేసేస్తున్నానంటూ అప్పట్లో మస్తాన్‌రావు అనేవారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

బాలినేని తన గురించి తన అలవాట్ల గురించి చెప్పిన ఈ మాటలకూ సమావేశంలో ఉన్నవారంతా నవ్వుకున్నారు .

Leave a Reply

%d bloggers like this: