జర్నలిస్టు ఫయాజ్ కు నివాళి…

జర్నలిస్టు ఫయాజ్ కు నివాళి…
టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) ఆధ్వరంలో 20 వేల అర్థక సహాయం
-ఫయాజ్ కుటుంబానికి అండగా ఖమ్మం ప్రెస్ క్లబ్ …

 

ఖమ్మంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం ఖమ్మంలో మరణించారు . పేదకుటుంబం నుంచి వచ్చిన ఫయాజ్ మంచి స్నేహశీలిగా ఉండేవారు . వారి మరణ పట్ల టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) ఆధ్వరంలో తీవ్రసంతాపం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించి నివాళులు అర్పించింది.

అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆకస్మిక మరణం పొందిన సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ కు యూనియన్, ఖమ్మం ప్రెస్ క్లబ్ నివాళి అర్పించింది. మరణ వార్త తెలిసిన వెంటనే విచారం వ్యక్తం చేసిన సంఘ నేతలు ఫయాజ్ గొప్పతనాన్ని చాటుతూ జండా వేడుకల అనంతరం జరిగిన సమావేశంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జర్నలిస్టు ఫయాజ్ కుటుంబానికి యూనియన్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని నేతలు పేర్కొన్నారు. అప్పటికప్పుడే అనుకున్నదే తడవుగా జర్నలిస్టులంతా తమ తమ శక్తి మేరకు అందించిన ఆర్థిక మొత్తం రూ. 20,500 ఖమ్మం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫయాజ్ కుటుంబ సభ్యులకు అందించారు. రిక్కా బజార్ లోని ఫయాజ్ నివాసానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

 

Leave a Reply

%d bloggers like this: