Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో అపశృతి …తారకరత్నకు గుండెపోటు!

లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో అపశృతి …తారకరత్నకు గుండెపోటు!
-పాదయాత్ర జరుగుతున్నసమయంలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న
-ఆసుపత్రికి తరలింపు …హాస్పత్రికి వెళ్లిన బాలకృష్ణ
-కుప్పంలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న  
-పాదయాత్రలో నడుస్తున్న సమయంలో సొమ్మసిల్లిన వైనం
-కుప్పంలోని కేసీ ఆసుపత్రిలో చికిత్స
-బెంగుళూరికి తరలిస్తామన్న బాలకృష్ణ

లోకేష్ పాదయాత్రలో మొదటిరోజునే అపశృతి చోటుచేసుకున్నది ..సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి పడిపోయిన ఆయన్నువెంటనే కుప్పంలో ఆసుపత్రికి తరలించగా ఏంజియో గ్రామ్ తీసిన డాక్టర్లు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు . మెరుగైన వైద్యంకోసం బెంగుళూరు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు .

వివరాల్లోకి వెళ్తే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల అనంతరం… మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల తాకిడి ఎక్కువయింది. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో తారకరత్నతో పాటు బాలకృష్ణ ఉన్నారు.

మెరుగైన వైద్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తారకరత్న విశ్రాంతి లేకుండా ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పర్యటనకు సంబంధించి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఇప్పుడు కుప్పంలో పాదయాత్రకు సంబంధించి కూడా ఆయన పర్యవేక్షణ చేశారు. కుప్పంకు ముందే చేరుకుని పనులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఎంతో అలసిపోయారు. ఈ ఉదయం నుంచి కూడా ఉత్సాహంగానే ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

తారకరత్న కోలుకుంటున్నాడు.. బెంగళూరుకు తరలిస్తున్నాం: బాలకృష్ణ

యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు తారకరత్న ప్రస్తుత పరిస్థితి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ… తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. బీపీ కంట్రోల్ లో ఉందని తెలిపారు. అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పారు. అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని అన్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారని అన్నారు.

కుప్పంలోని డాక్టర్లు మంచి చికిత్స చేశారని… ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకుగాని, మరెక్కడికైనా తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని… తాము బెంగళూరుకు తరలిస్తున్నామని బాలయ్య చెప్పారు. ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ, వాటిలో సరైన వైద్య పరికరాలు ఉండవని… అందువల్ల రోడ్డు మార్గంలో అంబులెన్సులో తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఆయన తాత ఎన్టీఆర్ , నానమ్మ ఆశీర్వాదాలు, భార్య మాంగల్య బలం, అభిమానుల ప్రార్థనల వల్ల ప్రాణాపాయం లేదని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబుప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.

 

Related posts

తెలంగాణాలో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కసరత్తు…

Drukpadam

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…

Drukpadam

బాలుడిపై చిరుత దాడి నేపథ్యంలో.. టీటీడీ కీలక నిర్ణయాలు!

Drukpadam

Leave a Comment