Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతపై కేసు నమోదు …!

అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతపై కేసు నమోదు …!
-‘అవినీతిపరుల చేతులు నరికేయండి’.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
-బహిరంగ సభలో పార్టీ జిల్లా నేత వ్యాఖ్యలపై దుమారం
-సదరు నేతపై బీజేపీ నాయకుల ఫిర్యాదు
-క్రిమినల్ కేసులు పెట్టిన పోలీసులు
-చర్చనీయాంశంగా మారిన బీజేపీ వైఖరి

మనదేశంలో అవినీతి ఒకజాడ్యంలా ఉంది .దీనికి ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు…అన్ని పార్టీలపై అవినీతి మరకలు ఉన్నాయి. ప్రధానంగా దక్షిణాదిన నోట్లతో ఓట్లు కొని పార్టీలు గద్దెనెక్కుతున్నాయి. ఏదైనా ఒకటి అర పార్టీలు తప్ప …”భక్త ప్రహ్లద సినిమాలో అన్నట్లు ఎక్కడ నీ దేవుడు అంటె అన్నిచోట్లా ఉన్నాడని …ఈస్తంభంలో ఉన్నాడా ఆంటే అందులో కూడా ఉన్నాడని ఎస్వీ రంగారావు కు కుమారుడు ప్రహ్లదుడు చెప్పినట్లుగా” అన్ని అంగల్లోకి,రంగాల్లో అవినీతి ఊడలు పాకాయి . దానికి బీజేపీకి నొప్పి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అవినీతి చేస్తున్నవారి చేతులు నరికేయండని అన్న కాంగ్రెస్ నేతపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం వారు కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోవడం విడ్డురంగా ఉంది . అవినీతి పరుల చేతులు నరికేయండని మాట్లాడటం కాంగ్రెస్ నేత చేసిన నేరమైతే ప్రతిరోజూ రాజకీయ నేతలు ఒకరిపై చేస్తున్న ఆరోపణలపై ఎన్ని కేసులు పెట్టాలి ?

అనినీతి లేని పాలన అందిస్తాం…. ప్రధాని మోడీ
అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా…పలు సందర్భాల్లో.. చంద్రబాబు
లంచం అడిగితె నేరుగా సీఎం కార్యాలయానికి ఫోన్ చేయండి …వరంగల్ సభలో సీఎం కేసీఆర్ ( ఆ ఫోన్ నెంబర్ పనిచేయడంలేదని విమర్శలు ఉన్నాయి )
లంచం లేని పాలన అందిస్తా…. ఏపీ సీఎం జగన్ …

అసలు బీజేపీ అవినీతికి వ్యతిరేకమా ? అనుకూలమా ? స్పష్టం చేయాలి …ఏ పార్టీకి చెందిన నేత అయినా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మాటలను స్వాగతించాలి …కానీ ఆలా చేయకుండా కేసు నమోదు చేయించడం తెలివి తక్కువ తనమే అవుతుంది. ఇది బీజేపీకి దేశ వ్యాపితంగా చెడ్డ పేరు తెస్తుంది.ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ తప్పును గ్రహించి సరిచేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సభలో చెప్పిన మాటలు బీజేపీకి రుచించలేదు . ఆయన చాలా సౌమ్యంగా అన్నమాటలు ఈవిధంగా ఉన్నాయి.

చేతులు జోడించి నమస్కరించండి.. అయినా వినకుంటే ఆ అవినీతిపరుడి చేతులు నరికేయండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. వందలాది ప్రజల ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సదరు నేతపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నీలేష్ జైన్ గురువారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. అవినీతిపరుల చేతులు నరికేయండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘హాత్ జోడో.. నహీ మానేతో భ్రష్టాచారీ కే హాత్ థోడో’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపూర పోలీస్ స్టేషన్ లో ఈమేరకు నీలేష్ జైన్ పై ఐపీసీ సెక్షన్ 504 (హింసను ప్రేరేపించడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ విధానాల కార‌ణంగా 24 గంట‌లు విద్యుత్‌:ఎంపీ నామ

Drukpadam

తీన్మార్ మల్లన్న బీజేపీకి గుడ్ బై …కొత్త పార్టీ దిశగా అడుగులు…

Drukpadam

పుదుచ్చేరి పీఠం తమకే కావాలంటున్న బీజేపీ.. కుదరదు పొమ్మన్న రంగస్వామి

Drukpadam

Leave a Comment