లోకేష్ పాదయాత్రపై టీడీపీ గంపెడు ఆశలు …

లోకేష్ పాదయాత్రపై టీడీపీ గంపెడు ఆశలు …
-రోడ్లు ఎక్కిన టీడీపీ శ్రేణులు
-జగన్ సర్కారుపై వాగ్బాణాలు
-స్క్రిప్ట్ ప్రకారమే నడక …ప్రసంగాలు
-అంతా డైరక్టన్ యాక్షన్

వన్ ,టు , త్రీ మైక్ టెస్టింగ్ …నిన్నటినుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది . యువగలం పేరుతో ప్రారంభించిన ఈ పాదయాత్రపై టీడీపీ గంపెడు ఆశలు పెట్టుకున్నది … టీడీపీ శ్రేణులన్నీ రోడ్లు ఎక్కాయి…. అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం నడక ..ప్రసంగాలు కొనసాగుతున్నాయి.ప్రత్యేకించి జగన్ సర్కారుపై వాగ్బాణాలే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం …ఫలితం మాత్రం ఏపీలో తిరిగి అధికారాన్ని పొందటామెలా అనేదే అసలు కథ …అంతా డైరక్టన్ యాక్షన్ ప్రకారమే ఈ కార్యక్రమం నడుస్తుంది.

లోకేష్ పాదయాత్ర 400 రోజులు 4 వేల కి .మీ లు…కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు జరగనున్న అంతా సినీ సెట్టింగ్ లా సెట్ చేశారు . అంతకు ముందు జగన్ పాదయాత్ర చేసినా ,ఇప్పుడు లోలేష్ చేస్తున్నా …అంతకుముందు చంద్రబాబు చేసినా అంతా అధికారమే పరమావధిగా కనిపిస్తుంది. పేరుకు ప్రజలు వారి సంక్షేమం అభివృద్ధి అని చెపుతున్నప్పటికీ కుర్చీ కోసమే అనేది బహిరంగ రహస్యమే …
లోకేష్ రాజనీతి తెలియదని ,పప్పుముద్దగా ఉంటాడనే పేరుంది.కానీ టీడీపీ శ్రేణులు ఆయన పాదయాత్రపై భారీ అంచనాలతో ఉన్నాయి.పైగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర కూడా తమకు ఉపయోగపడుతుందని టీడీపీ ఆశపడుతోంది.రెండు పార్టీలు కల్సి జగన్ ను అధికారం నుంచి దించి తాము అధికారం చేపట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

ఏపీ ఎన్నికలకు మరో 16 నెలలకు పైగా సమయం ఉంది. అయితే ఎప్పటికప్పుడు ఇప్పుడే ఎన్నికలు వస్తున్నాయన్నట్లుగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. విచిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసిపిని గద్దె దించాలని ప్రతిపక్షాలుగా ఉన్న లెఫ్ట్ రైట్ పార్టీలు కోరుకుంటున్నాయి. పవన్ ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఉండాలని అందరిని ఐక్యం చేసే పనిలో ఉన్నారు . అయితే కమ్యూనిస్టులు బీజేపీ ఉన్న కూటమితో జట్టుకట్టడం జరిగేపనికాదు .అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రతిపక్షాలు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఒక్కటిగా ఉండటం సాధ్యమయ్యే పని కాకపోవచ్చునని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం .

జగన్ తన సంక్షేమ పాలనపై నమ్మకంతో ముందుకు పోతున్నారు. కేంద్రంతో యుద్ధం కాకుండా సయోధ్యతో రాష్ట్రానికి మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు . తనకు అనుకున్న విధంగా విశాఖకు పరిపాలన రాజధానిని తీసుకోని పోవడంద్వారా తాను అనుకున్నది సందించగలరనే నమ్మకాన్ని ప్రజల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు .

మూడు రాజధానులు … లేదు అమరావతి నే రాజధాని అని రాష్ట్రంలో ఒక గంబీరమైన వాతావరణం నెలకొని ఉన్నది .అధికారం లో ఉన్న జగన్ సర్కార్ మూడు రాజధానులకోసం అసెంబ్లీ లో సైతం తీర్మానం చేసింది. అంతకు ముందు చంద్రబాబు అమరావతి పేరుతో విజయవాడకు సమీపంలో 33 వేల ఎకరాల ప్రవేట్ ల్యాండ్ సేకరించి రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు . దీనిపై ప్రతిపక్షాలకు అధికార పక్షానికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. అసెంబ్లీ చేసిన తీర్మానమా? లేక రాజధానికోసం భూములు ఇచిన రైతుల మాట చెల్లుబాటు కావాలా ? అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు లో రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో మూడు రాజధానులు విషయంలో అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుతుంది. దీనిపై సుప్రీం వాదనలు విని తీర్పు ఇవ్వాల్సి ఉంది . అప్పటివరకు ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని యాత్రలు చేసినా సుప్రీం తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారె అవకాశం ఉంది.

Leave a Reply

%d bloggers like this: