వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

  • ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుందన్న అప్రూవర్ దస్తగిరి
  • నిజం బయటపడాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని వ్యాఖ్య
  • 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావాలని సమన్లు అందుకున్నానని వెల్లడి

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలేంటో త్వరలోనే తెలుస్తాయని అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి చెప్పారు. నిజం బయటికి రావాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని అన్నారు. త్వరలో ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుందని అన్నారు.

కేసు విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేయడం మంచిదేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి సమన్లు తీసుకున్నట్లు వెల్లడించారు.

సీబీఐ అధికారులు పక్కా సమాచారంతోనే అందరిని విచారణకు పిలుస్తున్నారని.. అందులో భాగంగానే ఇటీవల అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారని గుర్తుచేశారు. ఎవిడెన్స్ లేనిదే ఎవరినీ విచారణకు పిలవరని అన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటనే దానిపై అన్ని వాస్తవాలను.. సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతానని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: