Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దుబాయ్ లో సొంతిళ్ల కోసం భారతీయులు ఖర్చు చేసిన సొమ్ము రూ.35 వేల కోట్లు!

దుబాయ్ లో సొంతిళ్ల కోసం భారతీయులు ఖర్చు చేసిన సొమ్ము రూ.35 వేల కోట్లు!

  • దుబాయ్ లో ఇళ్ల కొనుగోలుకు భారత సంపన్నుల ఆసక్తి
  • బిజినెస్ బే ప్రాంతంలో 40 శాతం భారతీయుల ఇళ్లే!
  • ఒక్కో ఇంటిని సగటున రూ.3.8 కోట్లతో కొనుగోలు
  • నెలకు రూ.3.5 లక్షల అద్దె చెల్లించేందుకు వెనుకాడని భారతీయులు

భారత సెలబ్రిటీలు విదేశాల్లో సొంతిళ్లు కొనుక్కోవడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా, మనవాళ్లకు దుబాయ్ స్వర్గధామంలా మారింది. చాలామంది దుబాయ్ లో ఇల్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా భారతీయులను ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పుడు దుబాయ్ లోని బిజినెస్ బే ప్రాంతంలోకి వెళితే అది మరో భారత్ లా కనిపిస్తే అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. భారత్ లో ఎంతో పేరుపొందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు బిజినెస్ బే ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు.

2022 రియల్ ఎస్టేట్ డేటా ప్రకారం దుబాయ్ లో సొంతిళ్లు కొనుగోలు చేసేందుకు భారతీయులు ఖర్చు చేసిన సొమ్ము రూ.35 వేల కోట్లు. 2021లో ఖర్చు చేసిన దానికి ఇది రెట్టింపు. దుబాయ్ బిజినెస్ బే ప్రాంతంలో ఇళ్లు కొనుగోలు చేస్తున్నవారిలో 40 శాతం మంది భారతీయులేనట. ముఖ్యంగా ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్ కు చెందినవారు ఎక్కువగా ఉన్నారని సదరు డేటా వెల్లడిస్తోంది.

అంతేకాదు, అనేకమంది భారత సంపన్నులు దుబాయ్ కి మకాం మార్చేస్తూ, అక్కడి విలాసవంతమైన అపార్ట్ మెంట్లను అద్దెకు తీసుకుంటున్నట్టు ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీఈవో వెల్లడించారు. దుబాయ్ లో నివాసం ఏర్పరచుకోవడం వల్ల తమ వ్యాపారం మరింత విస్తృతం అవుతుందని అనేకమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు.

దుబాయ్ నుంచి వివిధ దేశాలకు వ్యాపార పర్యటనలు చేయడం సులువు అవుతుందని, దుబాయ్ ఫిన్ టెక్ సేవల రంగం ఎంతో సౌలభ్యంతో కూడుకున్నది కావడంతో, అనేకమంది భారత యువ వ్యాపారవేత్తలను ఆకర్షించగలుగుతోందని జేవీ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గోయెల్ తెలిపారు. ఉదాహరణకు తన భార్య కూడా ఓ ఫిన్ టెక్ వెంచర్ స్థాపించిందని, దుబాయ్ లో ఉండడం వల్ల అనేక ప్రపంచ మార్కెట్లతో లావాదేవీలు జరిపేందుకు అత్యంత వెసులుబాటు కలుగుతోందని గోయెల్ వెల్లడించారు.

కాగా, దుబాయ్ లో భారతీయులు ఒక్కో ఇంటిని సగటున రూ.3.8 కోట్లకు కొనుగోలు చేస్తున్నారట. అదే సమయంలో అపార్ట్ మెంట్లకు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షలు అద్దె కూడా చెల్లిస్తున్నారని వెల్లడైంది

Related posts

రూపాయ మరింత పతనం… డాలర్ కు 79 .57 రూపాయలు !

Drukpadam

ల్యాబ్ లో తయారు చేసిన మాంసంపై నిషేధం విధించిన ఇటలీ.. ప్రపంచంలోనే తొలి దేశం!

Drukpadam

ప్రయాణికులకు శుభవార్త …ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు గ్రీన్ సిగ్నల్!

Drukpadam

Leave a Comment