Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు! !

రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్…!
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లు

2023–2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను కేటాయించింది. ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ అంచనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,215గా ఉందని హరీశ్ రావు ప్రకటించారు.

ఇక బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 26,931 కోట్లను కేటాయించింది. నీటి పారుదల శాఖకు రూ. 26,885 కోట్లు, విద్యుత్ కు రూ.12,727 కోట్లు ఇచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు, దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం 15,233 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు కేటాయింపులు చేసింది.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు ఇవే..!
రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధికి రూ. 36,750 కోట్ల కేటాయింపు
పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు

2023–2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది. ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భారీ బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు చేసింది.

శాఖల వారీగా కేటాయింపులు

షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
నీటి పారుదల రంగంకు రూ. 26,885 కోట్లు,
వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు
విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15, 233
విద్యుత్ రంగం రూ. 12,727 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
హోంశాఖకు రూ.9,599 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 6,229 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
రైతు బంధు పథకంకు రూ. 1,575 కోట్లు
రైతు బీమా పథకంకు రూ. 1,589 కోట్లు
ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంకు రూ. 200 కోట్లు

రైతులకు తెలంగాణ సర్కారు తీపి కబురు.. రుణమాఫీకి రూ. 6 వేల కోట్ల కేటాయింపు

ఆర్థిక సంవత్సరానికి దాదాపు మూడు లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో రైతులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతు రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ. 26,931 కోట్లకు ఇది అదనం. ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది.

Related posts

సిద్ధరామయ్య నేపద్యం….

Drukpadam

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల వివరాలు సుప్రీంకోర్టుకు!

Drukpadam

పిచ్చుక మృతితో గ్రామస్థుల కన్నీళ్లు..

Drukpadam

Leave a Comment