Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేల కొనుగోలుకేసులో తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్ !

ఎమ్మెల్యేల కొనుగోలుకేసులో తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్ !
కేసును సీబీఐ విచారణకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్..
సీబీఐ విచారణకు ఆదేశించిన సింగిల్ బెంచ్
సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన కోర్టు
ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన డివిజన్ బెంచ్
సుప్రీంకోర్ట్ కు వెళ్లెవరకూ ఆర్డర్ సస్పెన్షన్ లో ఉంచాలని అడ్వకేట్ జనరల్ వినతిని నిరాకరించిన హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ కు వెళ్లేందుకు వీలుగా ఇచ్చిన ఆర్డర్ ను సస్పెన్షన్ లో ఉంచాలని రాష్ట్ర హైకోర్టు అడ్వొకేట్ జనరల్ చేసిన విజ్ఞప్తిని నిరాకరించించింది .దీంతో సిబిఐ దర్యాప్తుకు మార్గం సుగమం అయింది .

కేసును సీబీఐకి అప్పగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. ఇక గత మూడు నెలలుగా ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఏసీబీ నుంచి సుప్రీం కోర్టు దాకా మొత్తం ఆరు కోర్టులు ఈ కేసును పరిశీలించాయి. సిట్ దర్యాప్తుతోనే ఈ కేసులో అన్ని విషయాలు బయటపడతాయని ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు వాదించింది.

అయితే.. సిట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని ప్రతివాదులు పేర్కొన్నారు. సీబీఐతో విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐకి ఇవ్వొద్దంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

Related posts

అక్షరాల పరిమితి లేకుండా కొత్త ఫీచర్ తీసుకువస్తున్న ట్విట్టర్!

Drukpadam

భట్టి పీపుల్స్ మార్చ్@100 డేస్…

Drukpadam

‘జగన్ బెయిల్ ర‌ద్దు’ పిటిష‌న్‌పై విచార‌ణ‌:.. రిజాయిండ‌ర్ దాఖ‌లు చేసిన ర‌ఘురామ‌..

Drukpadam

Leave a Comment