Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అప్రకటిత విద్యుత్ కోతలు…ఎండుతున్న పంటలు…

అప్రకటిత విద్యుత్ కోతలు…
●ఎండుతున్న పంటలు
●ఆందోళన భాట పట్టిన రైతులు

(పోలంపల్లి నాగేశ్వరరావు,  సీనియర్ జర్నలిస్ట్ )

ఓ వైపు భానుడి భగభగలు.. మరోవైపు అప్రకటిత విద్యుత్‌ కోతలు.. వెరసి వేసవి తొలినాళ్లలోనే ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పేరుకు 24 గంటల విద్యుత్‌ సరఫరా అని ప్రభుత్వం చెబుతున్నా… గంటల కొద్దీ కోతలు విధిస్తున్నారు. నీరందక పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.

వేళాపాళా లేని విద్యుత్ కోతల కారణంగా ఉక్కపోతతో జనం అల్లాడుతుంటే.. నీరందక పంటలు ఎండిపోతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి కరెంట్ కోతలు అధికంగా ఉన్నా… డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేయడం లేదు. విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ…బుధవారం ముదిగొండ, భాణాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు హామీ ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిబోర్ల, బావుల కింద కింద పత్తి, మిర్చి, వరి సాగు చేపట్టారు. బోర్లలో నీళ్లు ఉన్నావిద్యుత్ కోతల కారణంగా రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఎండలు విపరీతంగా పెరగడంతో రోజూ తడి పెట్టాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు. వచ్చి పోయే కరంట్ తో నీరు పెట్టిన దానికే పెట్టాల్సి వస్తుందని లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అర్థ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల, గ్రామాల్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆ వేళల్లో కూడా పలుసార్లు ట్రిప్ కావడంతో గంటల తరబడి అప్రకటిత కోతలు విధిస్తున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పొలాల్లో నీరు పారక పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదు.

Related posts

శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌.. జితేంద‌ర్‌రెడ్డి, డీకే అరుణ‌ల పాత్ర‌పై విచార‌ణ‌…

Drukpadam

ఢిల్లీలోనే సుప్రీంకోర్టు ఉండటం అన్యాయం: మద్రాస్ హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు!

Drukpadam

ఇళ్లల్లోంచి బయటకు రావద్దంటూ సుడాన్‌లోని భారతీయులకు హెచ్చరిక!

Drukpadam

Leave a Comment