ఏపీ అసెంబ్లీ వద్ద ప్లకార్డులు చేతబట్టి బాలకృష్ణ నిరసన!

ఏపీ అసెంబ్లీ వద్ద ప్లకార్డులు చేతబట్టి బాలకృష్ణ నిరసన!

  • బడ్జెట్ సమావేశాలకు హాజరైన బాలయ్య
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన
  • ‘అప్పుల ఆంధ్రప్రదేశ్’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించిన నందమూరి హీరో

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వద్ద టీడీపీ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.

‘ఏపీలో దివాలా బడ్జెట్.. జగన్ రెడ్డి కళకళ.. ప్రజలు గిలగిల’ అని రాసి ఉన్న బ్యానర్ ను పట్టుకుని టీడీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి బాలయ్య వచ్చారు. ఈ సందర్భంగా ‘అప్పుల ఆంధ్రప్రదేశ్’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

మరోవైపు అసెంబ్లీ లాబీల్లో బాలకృష్ణ సందడి చేశారు. బాలయ్యను మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాథ్‌ పలకరించారు. ‘ఏం హీరో గారు’ అంటూ బాలయ్యకు బొత్స అభివాదం చేశారు. ఇవాళ కోటు వేసుకురాలేదేమంటూ మంత్రి అమర్నా‌థ్‌ను ఉద్దేశించి బాలయ్య చమత్కరించారు.

Leave a Reply

%d bloggers like this: