Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో అత్యంత నాటకీయ పరిణామాలు…ఈడీ విచారణకు కవిత డుమ్మా…!

ఈనెల 20 ఈడీ ముందుకు కవిత రావలసిందే ఈడీ మరో నోటీసు …!
అత్యంత నాటకీయపరిణామాల మధ్య కవిత కు తిరిగి ఈడీ నోటీసులు
బుధవారం ఆమె ఈడీకి హాజరు కాకుండా డుమ్మా
ఆమె ఎందుకు రాలేదని ఈడీ కోర్ట్ ఆరా
ఆమె కేసులో అనుమానితురాలేనని ఈడీ కోర్ట్ కు తెలిపిన అధికారులు
రామచంద్రపిళ్ళై కస్టడీ పొడగింపుకవిత విచారణకు హాజరు కానందునే అనే ప్రస్తావన

లీక్కర్ స్కామ్ లో ఢిల్లీలో అత్యంత నాటకీయపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈడీ విచారణ కోసమని ఢిల్లీ వచ్చిన కవిత విచారణకు డుమ్మా కొట్టారు. తాను హాజరుకాక పోవడానికి గల కారణాలను అమె తన లాయర్ ద్వారా ఈడీ అధికారులకు తెలిపారు.

ఈనెల 20 ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కావాల్సిందేనని ఈడీ కేంద్ర కార్యాలయం నోటీసులు జారీచేసింది.ఆమె సుప్రీంకోర్ట్ లో కేసు ఉన్నందున తాను కేసు విచారణ అనంతరం హాజరౌతారనని చెప్పినప్పటికీ దాన్ని ఈడీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హంఅంతే కాకుండా బుధవారం తో ముగిసిన రామచంద్రన్ పిళ్ళై ని కవిత తో కలిపి ఆయన్ను విచారించాల్సి ఉన్నందున ఆయన కస్టడీ పొడిగిస్తున్నట్లు ఈడీ కోర్ట్ తెలిపింది .అయితే ఆమె కేసులో అనుమానితురాలేనని అధికారులు తెలిపారు .

ముందు ఆమె ఈనెల 11 ఢిల్లీ లో ఈడీ కార్యాలయానికి హాజరైయ్యారు . సుమారు 9 గంటలకు పైగా ఈమెను ఈడీ అధికారులు విచారణ జరిపారు .ఆరోజు ఆమెను అరెస్ట్ చేస్తారని అనుకున్న తిరిగి 16 హాజరు కావాలని కోరారు . ఆమె ఈడీ విచారణకు ఢిల్లీ వచ్చారు .కానీ అత్యతం నాటకీయపరిణామాల మధ్య ఆమె హాజరు కాకుండా తన లాయర్ ను కొన్ని డాక్యుమెంట్స్ తో పంపించారు . అందులో ఆమె తనను ఈడీ కార్యాలయంలో కాకుండా ఇంటివద్ద వద్ద విచారించాలని కోరారు .అంటే కాకుండా ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలవడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే కాకుండా తాను ఈడీ ముందు హాజరు కావాలా వద్దా అనే విషయం సుప్రీం కోర్ట్ ముందు ఉందని అందువల్ల హాజరు కాలేనని ఈడీకి పంపిన లేఖలో పేర్కొన్నది. ఆమె ప్రత్యేక లాయర్ భరత్ స్వయంగా ఆమె తరుపున ఈడీ కార్యాలయానికి వెళ్లి లేఖతోపాటు , కొన్ని డాక్యుమెంట్లు ఈడీ కార్యాలయంలో అందజేశారు . దీంతో అప్పటి వరకు అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని ఈడీ అధికారులు ఉపసహంరించారు.

తిరిగి నోటీసులు రావడంతో ఆమె ఈనెల తిరిగి హాజరవుతారా ?లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి . ఆమె ఈడీ అధికారులకు మరో లేఖ అందిస్తారా ? లేక కోర్ట్ కు వెళతారా ? అనేది ఆసక్తిగా మారింది .

ఈనెల 20 విచారణకు హాజరు కావాలని ఈడీ కోరడంతో ఆమె తిరిగి హైద్రాబాద్ బయలుదేరారు .ఆమెతో పాటు మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు లు కూడా ఢిల్లీ నుంచి హైద్రాబాద్ బయలు దేరారు

 

Related posts

నళీనికి ఉద్వోగం ఇవ్వడానికి ఇబ్బంది…?పోలీస్ ఉన్నతాదికారులను ప్రశ్ని0చిన సీఎం,…

Ram Narayana

వచ్చేవారం తూర్పు తీర ప్రాంతాలకు సైక్లోన్ మోచా ముప్పు!

Drukpadam

ఇన్ స్టాగ్రామ్ లో లోపాన్ని పట్టేసి భారీ నజరానా కొట్టేసిన షోలాపూర్ కుర్రవాడు!

Drukpadam

Leave a Comment