షర్మిల పాలేరులో పోటీపై మనసు మార్చుకున్నారా… ?

షర్మిల పాలేరులో పోటీపై మనసు మార్చుకున్నారా… ?
-పాలేరు లో పోటీ మంచిది కాదని ఆమెకు సలహాలు ఇస్తున్నారా …
-ఇటీవల పాలేరులో షర్మిల సహాయం నిలిపివేశారని ప్రచారం
-తర్వాత ఇస్తామని అంటున్న షర్మిల అనుయాయులు
-తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవంటున్న షర్మిల పార్టీ నేతలు
-కచ్చితంగా పాలేరులో పోటీచేస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేతలు
-ఈనెల 28 నుంచి 15 రోజులు పాలేరు లో షర్మిల పర్యటనలు

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాలేరు లో పోటీపై మనుసు మార్చుకున్నారా ? కొందరు పాలేరులో పోటీ మంచిదికాదని ఆమెకు సలహాలు ఇస్తున్నారా ? అందుకే ఆమె నియోజకవర్గంలో పేదలకు చేస్తున్న సహాయం ఇటీవల నిలిపివేశారా? అంటే చెప్పలేక పోతున్నారు పరిశీలకులు …అయితే ఇటీవల ఆమె బృందం కదలికలు అందుకు సందేహాలను కలగ చేస్తుంది. ఆమె ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేస్తానని జిల్లా పాదయాత్రకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు . అందుకు అనుగుణంగానే ఇక్కడ పార్టీ కార్యాలయం కట్టించేందుకు నిర్ణయించుకొని ,సుమారు ఒక ఎకరం భూమి కొనుగోలు చేసి భూమి పూజ కూడా చేశారు . దీనికి తన తల్లి వైయస్సార్ ధర్మపత్ని విజయమ్మతో సహా హాజరైయ్యారు . ఆసందర్భంగా జరిగిన సభలో తల్లి కూతుళ్లు ప్రసంగించారు . ఇక నుంచి షర్మిల పాలేరు బిడ్డ అంటూ పాలేరు ప్రజలకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు . సభకు పెద్దగా ప్రజలను తరలించలేకపోయారనే విమర్శలు వచ్చాయి.

తర్వాత కొంత కాలానికి పాలేరు లో గతంలో మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకులుగా పనిచేసి నియోజకవర్గం అంతటా పరిచయాలు ఉన్న రవీందర్ రెడ్డిని ఆమె పాలేరులో తనకు పర్సనల్ అసిస్టెంట్ గా నియమించుకున్నారు . ఆయన ద్వారా నియోజకవర్గంలో పేదలకు ఆపద వచ్చినప్పుడు లేదా చనిపోయిన కుటుంబాలకు సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . అది కూడా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి 10 వేల రూపాయలు సహాయం అందిస్తుండగా షర్మిల సహాయం 25 వేలు ఇవ్వడం మొదలు పెట్టారు .దీంతో షర్మిల ముందు ఎవరైనా తట్టుకోవడం కష్టం అనేలా ప్రారంభ కార్యక్రమం అదిరింది . కానీ గత కొద్దిరోజులుగా సహాయం నిలిపివేశారు .దీంతో ఆమె ఇక్కడ పోటీచేస్తారా…? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి . కొందరు ఆమె హైద్రాబాద్ లోని కూకట్ పల్లి నుంచి పోటీచేస్తారని కూడా అంటున్నారు. సహాయం కోసం రవీందర్ రెడ్డిని కలిసి అడిగితె కొద్దిరోజులు ఆగమని అందరికి సహాయం చేస్తామని చెపుతున్నాడని అంటున్నారు . నెల రోజుల క్రితం షర్మిల తల్లి విజయమ్మ వచ్చి సాయి గణేష్ నగర్ లోని షర్మిల క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. అక్కడ నుంచే షర్మిల క్యాంపు నడుస్తుంది . అయినా ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి .

షర్మిల కచ్చితంగా పాలేరు లో పోటీచేస్తారు …పార్టీ రాష్ట్ర నేత

షర్మిల పాలేరులో కాకుండా హైద్రాబాద్ నగరంలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో పోటీచేస్తున్నారని వస్తున్న పుకార్లపై ఆ పార్టీ రాష్ట్ర నేతను సంప్రదించగా లేదు …లేదు షర్మిల పాలేరు నుంచే కచ్చితంగా పోటీచేస్తారని తెలిపారు . అంతేకాదు ఈనెల 28 నుంచి 15 రోజులపాటు పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారని పేర్కొన్నారు . ఆమె పాలేరులో పోటీచేయటం ఖాయమని ఇందులో రెండవ మాటకు తావులేదని స్పష్టం చేశారు . పాలేరు లో పోటీ, ప్రచారం పై తమ వ్యూహాలు తమకు ఉన్నాయని అందుకు అనుగుణంగా తమ టీం పనిచేస్తుందని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: