ప్రధాని మోదీతో అరగంట పాటు భేటీ అయిన సీఎం జగన్

  • పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో భేటీ
  • పలు అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.
  • కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్న ముఖ్యమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి చెందిన పలు అంశాలను ప్రధాని వద్ద జగన్ ప్రస్తావించినట్టు సమాచారం. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. 

నిన్న సాయంత్రమే జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత జగన్ ఢిల్లీకి బయల్దేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మధ్యాహ్నం 2.30 గంటలకు జగన్ సమావేశం కానున్నారు. ఇతర కేంద్ర మంత్రులతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీలో అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ 

  • ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
  • ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ
  • ఈ మధ్యాహ్నం అమిత్ షాతో సమావేశం
  • రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
CM Jagan meeting with Amit Shah concludes

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించిన సీఎం జగన్… ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా ఎదుట ప్రస్తావించారు. విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి సమర్పించినట్టుగానే, అమిత్ షాకు కూడా విజ్ఞాపన పత్రం అందజేసినట్టు తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

Leave a Reply

%d bloggers like this: