కెనడా,అమెరికా కాదు, ముందు మనదేశంలో తిరగండి….పంజాబ్ డిప్యూటీ స్పీకర్

కెనడా అమెరికా కాదు ముందు భారతదేశంలో వివిధ ప్రాంతాలను తిరిగి ఇక్కడ పరిస్థితులను తెలుసుకొనిదేశ అభివృద్ధి కోసం పాటుపడాలని పంజాబ్ డిప్యూటీ స్పీకర్ జై కృష్ణ సింగ్ కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐజేయూ జాతీయ కార్యవర్గ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన దేశంలో అనేక వనరులు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశాభివృద్ధిలో జర్నలిస్ట్ ల పాత్ర కీలకమని అభిప్రాయ పడ్డారు. అప్పుడే మన దేశం సుసంపన్నంగా వర్ధిల్లుతుంది అందుకు ముఖ్య భూమిక పోషిస్తున్న జర్నలిస్టుల ప్రతినిధులుగా మీరు అక్కడకి రావడం అభినందనీయమని అన్నారు. పంజాబ్ పరిస్థితులను కూడా తెలుసుకోవాలని అన్నారు.

తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని మొదట ఫోటోగ్రఫీలో పనిచేశానని, ఫోటో ఫ్రేములు కూడా కట్టానని అన్నారు. నేడు ఈ స్థాయికి రావడానికి అనేక కష్టాలు పడ్డ విషయాన్ని ఆయన గుర్తు చేశారు . కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ,సెక్రటరీ జనరల్ బల్వందర్ జమ్ము ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలంగాణ నుంచి ఐజేయూ కార్యదర్శి వై .నరేందర్ రెడ్డి ,రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు నగునూరి శేఖర్ ,విరహత్ అలీ ,మాజీద్ , దాసరి కృష్ణరెడ్డి, కె.రాంనారాయణ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆలపాటి సురేష్ , జి.సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: