ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • కవితను విచారిస్తున్న ఈడీ
  • మహిళలను కార్యాలయంలో విచారించడంపై సుప్రీంలో కవిత పిటిషన్
  • కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దన్న ఈడీ
  • ఆ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఈడీ కేవియెట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని ఈడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

%d bloggers like this: