Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంఢీగఢ్ లో జయప్రదంగా ముగిసిన ఐజేయూ సమావేశాలు

ఈనెల 18,19 తేదీలలో రెండు రోజుల పాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉత్తర భారత్ లోని అందమైన నగరం చంఢీగఢ్ లో అంత్యంత జయప్రదంగా ముగిశాయి. ఈ సమావేశాలకు పంజాబ్, చంఢీగఢ్ జర్నలిస్టు యూనియన్ ఘనమైన అతిద్యం ఇచ్చింది.

జర్నలిజానికి ఎదురవుతున్న సవాళ్ళు , దాడులు, కేసులు, చివరకు జర్నలిస్టులను హత్యలు చేయడం వరుకు వెళ్లిన పరిస్థితులపై సమావేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇలాంటి సంఘటనలపై పాలకుల నిర్లిప్తతను సమావేశం తీవ్రంగా తప్పు పట్టింది. జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు చాలీ చాలనీ వేతనాలు ,అసలు వేతనాలే లేకపోవడం ఉద్యగభద్రత , వేతన చట్టాలను వేయకపోవడం, గతంలో వేసిన చట్టాల సిఫార్సులను అమలు జరపక పోవడంపై సమావేశాలు నిరసన వ్యక్తం చేసింది.

సమావేశాల ప్రారంభానికి ముందు పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జై కిషన్ సింగ్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని సమస్యలు పరిష్కార మార్గాల పై లోతైన అధ్యయనం జరగాలని అభిప్రాయ పడ్డారు.

చండీగఢ్‌లోని కిసాన్ భవన్‌లో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) రెండు రోజులు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు. మొదటి రోజు ప్రారంభ సమావేశానికి పంజాబ్ సమాచార మరియు పౌర సంబంధాల మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సమాజాన్ని నిర్మించడంలో మీడియా కీలక పాత్రను ప్రశంసించారు. ప్రజాస్వామ్యం పటిష్టంగా, స్వతంత్రంగా ఉండటం అవసరమన్నారు . అలాగే సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు అందించడం మీడియా ముందున్న బాధ్యత మరవద్దని కోరారు. మీడియా పక్కదార్ల పడితే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదమన్నారు. . ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు కొన్ని సార్లు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ సమాజంలో అశాంతికి గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవాలను సమాజానికి అందించాల్సిన బాధ్యతను జర్నలిస్టులు మరవద్దన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని జర్నలిస్టులు గుర్తుంచుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని , వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ను తప్పకుండా జర్నలిస్టులతో సమావేశం అయ్యె విదంగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమర్ దేవ్లపల్లి జాతీయ మీడియా సలహాదారు, ఐజేయూ మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, స్క్రైబ్స్ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆలపాటి, సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. . . జమ్మూతో సహా దేశంలోని 20 రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా ప్రముఖ జర్నలిస్టులు వచ్చి జర్నలిజాన్ని కాపాడేందుకు తమ అభిప్రాయాలను పంచుకోవడం విశేషం.

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) మాజీ జాతీయ అధ్యక్షుడు. అధ్యక్షుడు ఎస్‌కే సిన్హా మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మీడియాను అణచివేయడం ప్రారంభించిన నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మీడియా స్వేచ్ఛను హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు . అదే సమయంలో, కొన్ని పెట్టుబడిదారీ సంస్థలు మీడియా యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా మీడియాను స్వాధీనం చేసుకోవడం తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అభిప్రాయ పడ్డారు . మంచి సమాజం ఏర్పడాలంటే మీడియాకు స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు బల్వీందర్ సింగ్ జమ్ము, పంజాబ్ ,చండీగఢ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బల్వీర్ సింగ్ జండూ, చండీగఢ్, హర్యానా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్, రాజకీయ నిపుణుడు, పండితుడు పియారా లాల్ గార్గ్ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ ఉపాధ్యక్షులు జైసింగ్ చిబ్బార్, కోశాధికారి బిందుసింగ్ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ది ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ప్రెసిడెంట్ అనిల్ గుప్తా మరియు పంజాబ్ అండ్ చండీగఢ్ యూనియన్ ఆఫీస్ బేరర్ సందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

రాత్రి పంజాబ్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సందువా పాల్గొని మాట్లాడుతూ సుందర మైన భారత నిర్మాణం లో మీడియా పాత్ర విడదీయరానిదని అన్నారు. దేశంలో ప్రత్యేకించి వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

రెండవ రోజు కిసాన్ భవనంలో తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాల లో జరుగుతున్న కార్యకలాపాల నివేదికలను ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర నివేదిక ను విరహత్ సమర్పించగా, ఆంధ్ర ప్రదేశ్ నివేదిక ను జనార్ధన్ ప్రవేశ పెట్టారు.

ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ పడిందని దాన్ని రక్షించేందుకు మీడియా స్వేచ్ఛను కాపాడాలనే తీర్మానాన్ని జాతీయ కార్యవర్గ సభ్యులు అలపాటి సురేష్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా అమోదించింది. ఈనెల 23న సేవ్ మీడియా దినోత్సవం జయప్రదం చేయాలని కోరారు.

నూతన జాతీయ కార్యవర్గం

ఉపాద్యక్షులు గా … ప్రభాకరన్.(కేరళ) బీరేందర్ సింగ్ జండు (పంజాబ్)అమర్ మోహన్ (బీహార్)

కార్యదర్శులుగా వై.నరేందర్ రెడ్డి (తెలంగాణ) డి.సోమసుంర్(ఆంధ్రప్రదేశ్). సుబాష్( తమిళనాడు) జై సింగ్ రావత్ ( ఉత్తరాఖండ్). కోశాధికారి గా. ప్రేమ్ భార్గవ్ (ఢిల్లీ)

జాతీయ కార్యవర్గ సభ్యులు. 1.ఆలపాటి సురేష్ (ఆంధ్ర ప్రదేశ్) 2. ఎన్.శేఖర్ 3. కె. సత్యనారాయణ (తెలంగాణ) 4. ఎం. ప్రసాద్ 5. నల్లి ధర్మారావు (ఆంధ్ర ప్రదేశ్) 6. నిరంజన్ బిశ్వాల్ (ఒడిసా) 7. సురేంద్ర నారాయణ్ సింగ్ (బీహార్) 8. నిలేశ్ నానా సింగ్ పాటిల్ ( మహారాష్ట్ర) 9. మతి మహరాజ్ (పాండిచ్చేరి)10. కె. రమేష కుమార్ (తమిళనాడు) 11.రిగ్జిమ్ (లఢాక్) 12. బల్వంత్ తక్షక్ (హర్యానా) 13.బింద్ సింగ్ (పంజాబ్)

కొత్తగా ఐజేయూ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

చంఢీగఢ్ లో ఈనెల 18,19 న జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో కొత్తగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా దేవులపల్లి అమర్, ఎస్.ఎన్ సిన్హా, ఎం ఎ మాజీద్, అంబటి ఆంజనేయులును నియమించారు.

Related posts

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ….తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం …

Drukpadam

విదేశీయులు ఇళ్లు కొనకుండా కెనడాలో నిషేధం!

Drukpadam

కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!

Drukpadam

Leave a Comment