కవితను 10 గంటలు విచారించిన ఈడీ అధికారులు

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ 

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • ఇప్పటికే కవితను ఓసారి ప్రశ్నించిన ఈడీ
  • నేడు రెండోసారి విచారణ
  • సుమారు 10 గంటల పాటు విచారణ
  • లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఇవాళ సుదీర్ఘంగా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. కొద్దిసేపటి కిందటే కవిత విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు కవితను ప్రశ్నించారు. 
  • లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఉదయం ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించిన అధికారులు, ఆ తర్వాత ఆమెను విడిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

%d bloggers like this: