రాష్ట్రపతి విందుకు హాజరైన మన ఎంపీలు …

రాష్ట్రపతి విందుకు హాజరైన మన ఎంపీలు …
దేశాధ్యక్షురాలి ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్ సందర్శించిన ఎంపీలు కేశవరావు,నాగేశ్వరరావు,రవిచంద్ర,పార్థసారథి రెడ్డి తదితరులు

ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం స్వీకరించిన ఎంపీలు

దేశప్రథమపౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డి  ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి  తదితర ఎంపీలు రాష్ట్రపతి భవన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన ఆతిథ్యాన్ని వారు ఇతర ఎంపీలతో కలిసి స్వీకరించారు.పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను దశల వారీగా పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎంపీలు కేశవరావు, నాగేశ్వరరావు,రవిచంద్ర, పార్థసారథి రెడ్డి,కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,పీ.రాములు,బీ.బీ.పాటిల్,మన్నె శ్రీనివాస్ రెడ్డిలు ఇతర ఎంపీలతో పాటు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించి ఆమెతో కలిసి అల్పాహారం,తేనీరు తీసుకున్నారు. ఇది తమకు అనుభూతిని కల్గించిందని మొదటిసారిగా ఎంపీలు గా పార్లమెంట్ కు వచ్చి రాష్ట్రపతితో కలిసి విందు ఆరగించడం తమకు కలిగిన కొత్త అనుభూతిగా పేర్కొన్నారు. అందరిని రాష్ట్రపతి పేరుపేరునా పలకరించారని దేశ మొదటి పౌరురాలుతో కలిసి రాష్ట్రపతి భవనంలో గడపడం తమకు దక్కిన అరుదైన అవకాశం అని పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు .

Leave a Reply

%d bloggers like this: