Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీలో బీవీ రాఘవులు వివాదం సమసిపోయింది: సీతారాం ఏచూరి…!

పార్టీలో బీవీ రాఘవులు వివాదం సమసిపోయింది: సీతారాం ఏచూరి…!
-ఏపీ సీపీఎంలో కలకలం రేపిన రాఘవులు రాజీనామా
-పొలిట్ బ్యూరో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాఘవులు ప్రకటన
-ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాల్లో సమస్యలు ఉన్నాయన్న సీతారాం ఏచూరి
-వచ్చే సమావేశాల్లో సమస్యలపై దృష్టి పెడతామని వెల్లడి
-రాఘవులు పొలిట్ బ్యూరో పదవిలో కొనసాగుతారని స్పష్టీకరణ

ఇటీవల సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో పదవికి సీనియర్ నేత బీవీ రాఘవులు రాజీనామా చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాలపై సమస్యలు ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. వీటిపై వచ్చే రాష్ట్ర కమిటీ భేటీల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పార్టీలో రాఘవులు వివాదం సమసిపోయిందని అన్నారు. రాఘవులు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

ఏపీ సీపీఎం నేతల్లో విభేదాలున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సీపీఎం ఏపీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక కావడంలో బీవీ రాఘవులు సహకరించారని సొంత పార్టీలోనే ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ ఆరోపణలపై సీపీఎం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ ను ఏపీకి పంపాలని నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయంతో మనస్తాపానికి గురైన నేపథ్యంలోనే రాఘవులు రాజీనామా చేశారని కథనాలు వచ్చాయి.

ఈనేపథ్యంలో సిపిఎం పార్టీ పోలిబ్యూరో పదవికి బి .వి రాఘవులు రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. దానిపై సిపిఎం స్పందించకపోవడంతో పార్టీలో ఏమి జరుగుతుందో అనే ప్రచారం ఉత్కఠత నెలకొన్నది . దీనిపై పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి పార్టీలో కొన్ని సంఘటనలపై చర్చులు జరుగుతున్నాయని పొలిట్ బ్యూరో లో బి .వి రాఘవులు కనసాగుతారని ఏచూరి స్పష్టం చేశారు .

Related posts

ఉద్యోగ ప్ర‌క‌ట‌న స‌రే.. ఎప్ప‌టిలోగా భ‌ర్తీ చేస్తారు?: రేవంత్ రెడ్డి

Drukpadam

నామినేషన్ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు పెళ్లి.. ఆపై భార్యతో నామినేషన్!

Drukpadam

పట్టాలు ఇస్తున్నాం… ఆ కేసులన్నీ రద్దు చేస్తాం: సీఎం కేసీఆర్ ప్రకటన…

Drukpadam

Leave a Comment