హజ్ యాత్రికులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం!

హజ్ యాత్రికులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం!

  • బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తాపడిన బస్సు.. ఆ వెంటనే మంటలు
  • మక్కా మసీదుకు వెళ్తుండగా ఘటన
  • మరో 29 మందికి గాయాలు
  • రంజాన్ మొదటి వారం కావడంతో మక్కాకు పోటెత్తుతున్న భక్తులు

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది హజ్ యాత్రికులు సజీవ దహనమయ్యారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని నైరుతి ప్రాంతంలో అసిర్ ప్రావిన్సును, అభా నగరాన్ని కలిపే రహదారిపై జరిగిందీ ఘటన. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తాపడింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. తప్పించుకోలేకపోయిన 20 మంది ప్రయాణికులు అగ్నికీలలకు ఆహుతయ్యారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రయాణికులు ఉమ్రా కోసం మక్కా మసీదుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. రంజాన్ నెల మొదటి వారం కావడంతో మక్కాను దర్శించుకునేందుకు వెళ్తే భక్తులతో రహదారులు రద్దీగా మారాయి.

Leave a Reply

%d bloggers like this: