మన చేతుల్లో లేని ప్రమాదాలు అనడానికి నిదర్శనం ఇదే!

మన చేతుల్లో లేని ప్రమాదాలు అనడానికి నిదర్శనం ఇదే!

  • అమెరికాలోని ఓ హైవే మీద జరిగిన ఘోర ప్రమాదం
  • ట్రక్ టైరు ఊడి కారుకు అడ్డంగా రావడంతో గాల్లోకి పల్టీలు 
  • టైర్ ఊడినా ముందుకే సాగిపోయిన పికప్ వ్యాన్

రహదారులపై వాహనాలు నడిపే సమయంలో ఎంతో శ్రద్ధ, అప్రమత్తత, జాగ్రత్తలు అవసరం. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. పక్కవాడి అజాగ్రత్త మన ప్రాణాల మీదకు తెస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తోటి వాహనదారుల నిర్లక్ష్యానికి బలైపోయిన వాహనదారులు ఎందరో ఉన్నారు. నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఓ ప్రమాద ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. అమెరికాలో హైవే మీద జరిగిన ఈ ప్రమాదం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనూప్ ఖాత్రా అనే వ్యక్తి ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశారు.

పలు వరుసల హైవే మీద వాహనాలు వేగంగా వెళుతున్నాయి. కియాసోల్ కంపెనీకి చెందిన పికప్ ట్రక్ ఒక వరుసలో వెళుతుండగా.. పక్క వరుసలో కారు అదే దిశలో ముందుకు వెళుతోంది. ఉన్నట్టుండి పికప్ ట్రక్ ముందు భాగంలోని ఎడమ టైర్ ఊడిపోయి పక్క వరుసలో వస్తున్న కారుకు అడ్డంగా వచ్చింది. దీని ధాటికి వేగంగా వస్తున్న కారు అంతెత్తున గాల్లో ఎగిరి కింద పడిపోయింది. నుజ్జు నుజ్జు అయింది. టైరు ఊడిపోయినా పికప్ ట్రక్ మాత్రం నింపాదిగా అలా ముందుకు వెళుతూనే ఉంది. దాన్నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాన్ని హాలీవుడ్ సినిమా సీన్లతో పోలుస్తూ కొందరు కామెంట్లు పెట్టారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.

Leave a Reply

%d bloggers like this: