రాహుల్ పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

రాహుల్ పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

  • విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడన్న ఎంపీ సంజయ్ జైస్వాల్ 
  • 2,000 ఏళ్ల కిందట చాణక్యుడు చెప్పిన మాటలనే గుర్తుచేశానని వెల్లడి 
  • రాహుల్.. ‘అలవాటుపడ్డ నేరగాడు’ అని ఆరోపణ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడని తీవ్రంగా విమర్శించారు. పైగా 2,000 సంవత్సరాల కిందట ఈ మాటలను చాణక్యుడు చెప్పాడని, ఈరోజు తాను గుర్తుచేశానని సమర్థించుకున్నారు.

బీహార్ లోని పశ్చిమ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ రోజు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విదేశాల్లో భారత్‌ను రాహుల్ గాంధీ అవమానించారు. మన ప్రజాస్వామ్యం, కోర్టులు, జర్నలిస్టులు అన్నీ తప్పు అని మీరు అన్నారంటే.. మీరు భారతదేశాన్ని విశ్వసించరని స్పష్టమవుతోంది’’ అని విమర్శించారు. రాహుల్.. ‘అలవాటుపడ్డ నేరగాడు’ అని ఆరోపించారు.

‘‘తనను తాను యువరాజుగా భావించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ వల్ల ఆందోళనకు గురయ్యాడు.. గత రెండు పర్యాయాలుగా మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని మోదీ ఏర్పాటు చేశారు’’ అని చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాల విషయంలో అవమానకరమైన ప్రసంగం చేశారని, ఆయన ఎక్కడికి వెళ్లినా ఓబీసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply

%d bloggers like this: