Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీ కేసును విచారించలేనన్న గుజరాత్ హైకోర్టు జడ్జి.

రాహుల్ గాంధీ కేసును విచారించలేనన్న గుజరాత్ హైకోర్టు జడ్జి.. వేరే ధర్మాసనంకు బదిలీ చేయాలని విన్నపం

  • మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష
  • గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసిన రాహుల్ గాంధీ
  • కేసును మరో ధర్మాసనం కు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి సూచించిన జస్టిన్ గీతా గోపీ

మోదీ ఇంటి పేరును కించపరిచారనే కేసులో గుజరాత్ లోని కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. ఈ క్రమంలో రాహుల్ గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేశారు. అయితే ఈ కేసును తాను విచారించలేనని జస్టిస్ గీతా గోపీ తెలిపారు. మరో బెంచ్ కు బదిలీ చేసేందుకు ఈ కేసును చీఫ్ జస్టిస్ కు హ్యాండోవర్ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆమె సూచించారు.

దీనిపై రాహుల్ తరపు న్యాయవాది పీఎస్ చపనేరి స్పందిస్తూ… ఈ కేసు విచారణకు మరో జడ్జికి కేటాయించేందుకు మరో రెండు రోజులు పడుతుందని తెలిపారు. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ కింది కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ వేయగా… ఆయన విన్నపాన్ని కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన కింది కోర్టు తీర్పును హైకోర్టులో నిన్న సవాల్ చేశారు. తన విన్నపాన్ని సూరత్ సెషన్స్ కోర్టు పట్టించుకోలేదని… దీని వల్ల తనకు మళ్లీ కోలుకోలేనంత నష్టం వాటిల్లుతుందని తన పిటిషన్ లో హైకోర్టుకు తెలిపారు.

Related posts

ముంబై జైల్లో అన్నం నీళ్లు ముట్టకుండా మొండికేస్తున్న ఆర్యన్ ఖాన్…

Drukpadam

హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం..!

Drukpadam

తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు ముహూర్తం ఫిక్స్ …?

Drukpadam

Leave a Comment