Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి నిర్ణయం ఆలశ్యం సరే …ఆమోదయోగ్యంగా ఉంటుందా….?

పొంగులేటి నిర్ణయం ఆలశ్యం సరే …ఆమోదయోగ్యంగా ఉంటుందా….?
-పొంగులేటి రాజకీయ నిర్ణయం..మరికొంత ఆలశ్యం
-ఏ పార్టీలో చేరాలనేదానిపైనా మేధోమధనం
-తొందర పడవద్దని హితుల సన్నిహితుల సూచన
-కర్ణాటక ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం
-బీఆర్ యస్ అభ్యర్థుల ఓటమే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయం
-పొంగులేటి , జూపల్లితోపాటు మరికొందరు నేతల కోసం బీజేపీ ,కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు
-తన రాజకీయ నిర్ణయంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పొంగులేటి

 

ప్రస్తుతం క్రాస్ రోడ్ లో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ నిర్ణయం మరికొంత ఆలశ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణయం ఆలశ్యం అయినప్పటికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా …అంటే కచ్చితంగా ఉంటుందని అంటున్నారు పొంగులేటి …ఇటీవల పలు ఇంటర్యూ లలో ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు . నిష్కర్షగా ,ముక్కు సూటిగా అనేక విషయాలను చెప్పినతీరు ఆలోచింపజేసేదిగా ఉంది . దేశంలోనూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు ,పరిణామాలను పొంగులేటి అండ్ టీం నిశితంగా పరిశీలిస్తుంది. చేరితే ఏ పార్టీలో చేరాలి … ఎందులో చేరితే మంచిది … తన రాజకీయ లక్ష్యం నెరవేలంటే ఎలాంటి అడుగులు వేయాలి … ఏది రాంగ్ …ఏది రైట్ అని విషయంలో చాలాకాలంగా మేధోమధనం జరుగుతుంది . తర్జన భర్జనలు పడుతున్నారు . అనేకమంది రాజకీయపండితులతో ఆలోచనలు పంచుకుంటున్నారు .

తన లక్ష్యం స్పష్టం అంటున్నారు …జిల్లాలో 10 సీట్లలో బీఆర్ యస్ ను ఓడించడం …రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దెదించడం … అందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు … ఇందుకోసం బీఆర్ యస్ వ్యతిరేకులను ఐక్యం చేసే పనిలో పడ్డారు . కేసీఆర్ మాటలు నమ్మి ఆయన చేతిలో మోసపోయిన వాళ్ళను కూడ దీస్తున్నారు . ఇప్పడు రాష్ట్రంలో బీఆర్ యస్ ను దీటుగా ఎదుర్కొనే పార్టీ ఏది …? బీజేపీ నా ..? కాంగ్రెస్సా అనేది చర్చనీయాంశంగా మారింది. తన ఒక్కడి కోసమే కాకుండా తనను నమ్ముకొని తన వెంట వచ్చిన వారికోసం ఆలోచనలు చేస్తున్నారు .కాంగ్రెస్,బీజేపీ లనుంచి ఆయనకు ఆఫర్లు ఉన్నాయి.

తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన హితులు ,సన్నిహితులు చెపుతున్నట్లు తెలుస్తుంది. ఆయన ముందు ఉన్న అప్షన్లు మూడు …అందులో ఒకటి బీజేపీ …రెండవది కాంగ్రెస్ … మూడవది స్వతంత్రంగా పోటీచేయాలని వస్తున్న సూచనలు … ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు స్వంతంత్రంగా పోటీచేయడం కష్టం …ఎన్నికలకు సన్నద్ధం కావడం ఇబ్బందిగా ఉంటుందని అభిప్రాయాలు వచ్చాయి. అయితే స్వతంత్రంగా పోటీచేయడం అనేదానిపై కొందరు రాష్ట్రస్థాయి నేతలతో కూడా ఆలోచనలు చేసినట్లు సమాచారం .

కర్ణాటక ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీలో చేరాలనే ఆలోచనలో కొందరు తెలంగాణ నేతలు ఉన్నారు . పొంగులేటి ,జూపల్లి సైతం కర్ణాటక ఫలితాల వరకు చూడాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం …

పార్టీ పొంగులేటి , జూపల్లి కృష్ణారావులపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత వారిద్దరూ .తమ ఆలోచనలకు మరింత పదును పెట్టారు . ఏపార్టీలో చేరినా ఇద్దరు కలిసి చేరతారా లేక ఎవరికీ వారు చేరతారా …? అనేది ఇంకా నిర్ణయించుకున్నారు లేదా అనేది స్పష్టం కాలేదు . ఇప్పటికే వారి మధ్య అనేక భేటీలు జరిగాయి. కొత్తగూడెం లో జరిగిన పొంగులేటి అభిమానుల ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కూడ రావడం తెలిసిందే … ఇంకా ఎంతమంది వీరితో టచ్ లో ఉన్నారు . ఎంతమంది చేరతారు…ఎవరెవరు చేరతారు అనేది ఉత్కంఠంగా మారింది .

 

 

Related posts

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు గుండెపోటు…

Drukpadam

గిరిజ‌న బిడ్డ‌ల‌పై మీకు ఎందుకింత కోపం?.. ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్!

Drukpadam

సభ నిర్వాణం తీరుపై సీఎం ,స్పీకర్ , శాశనసభ వ్యవహారాల మంత్రి లేఖ రాస్తా …భట్టి

Drukpadam

Leave a Comment