Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..? ఇలా చెస్తే చాలు..!

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..? ఇలా చెస్తే చాలు..!

  • రాత్రి 7-8 గంటల పాటు నిద్రపోవడం ముఖ్యం
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పోషకాహారానికి చోటు ఇవ్వాలి
  • వ్యాయామం తప్పకుండా చేయాలి
  • తగినంత నీటిని తీసుకోవాలి

మన చుట్టూ ఉన్న వారిలో కొందరు ఎంతో హుషారుగా, చలాకీగా, ఉత్సాహంగా కనిపిస్తుంటారు. అంత ఉత్సాహంగా ఎలా ఉండగలరబ్బా..? అన్న సందేహం కూడా వస్తుంటుంది. కొందరు డల్ గా, ఏదో పోగొట్టుకున్న వారిలా, నీరసంగా ఉంటారు. మనం మాత్రం ఇలా డల్ గా ఉన్నామేంటి? అనుకునే వారూ ఉన్నారు.

అయితే, ఉత్సాహంగా లేకపోవడానికి కారణాలు ఏంటో గుర్తిస్తే ఆ సమస్య నుంచి బయటకు రావచ్చు. తీసుకునే ఆహారం, జీవనశైలి, చూసే దృక్పథం, వ్యక్తిత్వం ఇలా ఎన్నో అంశాలు దీని వెనుక పాత్ర పోషిస్తుంటాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలని కోరుకునే వారు కొన్నింటిని ఆచరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • ప్రతి రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అంటే కనీసం 7-8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర తగినంత లేకపోతే చిన్న పనికే అలసట అనిపిస్తుంది. దేనిపైనా దృష్టి పెట్టలేరు. ఉత్పాదకత తగ్గిపోతుంది.
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకునే ఆహారం కూడా ఆ రోజుకు మనం ఎలా ఉంటామన్నది ప్రభావం చూపిస్తుంది. మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల మనకు కావాల్సినంత శక్తి లభిస్తుంది. ఆ శక్తి కూడా వెంటనే కరిగిపోయే కర్పూరం మాదిరిగా ఉండకూడదు. అందుకని ఫైబర్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
  • ఇక శరీరంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగాలంటే నీరు అవసరం. మన శక్తి విషయంలో నీటికీ పాత్ర ఉంది.
  • ఇక రోజువారీ వ్యాయామం చేయడం అన్నింటికంటే ముఖ్యమైనది. కనీసం 30-40 నిమిషాలు చెమటలు పట్టేలా వ్యాయామం చేయాలి. దీనివల్ల శారీరక, మానసిక సామర్థ్యం బలోపేతం అవుతుంది.
  • రోజులో మధ్య మధ్యలో విశ్రాంతి అవసరం. అప్పుడు శరీరం, మనసు రీచార్జ్ అవుతాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత వీలైతే 15 నిమిషాలు కునుకు తీయడం కూడా మంచిదే.
  • ఒత్తిడి పెద్దగా లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎంత శక్తి ఉన్నా, ఒత్తిడి ఉంటే ఉత్సాహంగా ఉండలేరు. ప్రాణాయామం, యోగ ఇందుకు ఉపయోగపడతాయి.
  • ఇక చివరిగా ఆరోగ్యకరం కాని, హాని చేసే అలవాట్లకు దూరంగా ఉండాలి. పొగతాగడం, మద్యపానం మానేయాలి. స్నాక్స్, జంక్ ఫుడ్ ను పక్కన పెట్టాలి.

Related posts

ఆఫ్రికాలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్.. 100 మందిలో 88 మంది చనిపోయే అవకాశం…

Drukpadam

ఢిల్లీ జె ఎన్ యూలో గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక రాతలు ..ఉద్రిక్త

Drukpadam

These Fitness Tips Help Take Inches off Your Waistline

Drukpadam

Leave a Comment