Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ గెలిస్తే… కేసీఆర్ సర్కారు నిరాశపరిచింది: రేవంత్ రెడ్డి…

రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ గెలిస్తే… కేసీఆర్ సర్కారు నిరాశపరిచింది: రేవంత్ రెడ్డి…

  • కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ క్విజ్ పోగ్రామ్
  • బోయిన్ పల్లిలో ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
  • సిప్లిగంజ్ ను ప్రభుత్వం సన్మానిస్తుందని భావించామన్న రేవంత్
  • ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం బాధ కలిగించిందని వెల్లడి
  • సిప్లిగంజ్ ను తామే సన్మానిస్తామని ప్రకటన

బోయిన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ గెలిచాడని, కానీ కేసీఆర్ సర్కారు నిరాశపరిచిందని అన్నారు.

ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ ను తెలంగాణ ప్రభుత్వం సన్మానిస్తుందని తాము భావించామని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని రేవంత్ పేర్కొన్నారు. అయితే, రాహుల్ సిప్లిగంజ్ ను తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు.

జూన్ 2న రాహుల్ సిప్లిగంజ్ కు భారీ సన్మానం నిర్వహిస్తామని, రూ.10 లక్షల నగదు కూడా అందిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక కోటి రూపాయల నగదు బహుమతి అందిస్తామని చెప్పారు. కళాకారులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం లభించడం తెలిసిందే. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు

Related posts

కర్ణాటక సీఎల్పీ సమావేశం… సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలతో సమాలోచనలు …

Drukpadam

మేమేమీ అలా ఫీలవడం లేదు: రాజీనామాలపై ఏపీ మంత్రులు!

Drukpadam

పొంగులేటి ఆధ్వరంలో కలక్టరేట్ కు రైతు భరోసా యాత్ర ఉద్రిక్తత…

Drukpadam

Leave a Comment