Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వృద్ధురాలు…చెప్పులు కొనిచ్చిన పేర్ని నాని…

మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వృద్ధురాలు… షోరూంకు తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చిన పేర్ని నాని…

  • మచిలీపట్నంలో ఘటన
  • పేర్ని నాని కారులో వెళుతుండగా కనిపించిన వృద్ధ మహిళ
  • కారు ఆపి వివరాలు కనుక్కున్న మాజీ మంత్రి
  • కొత్త చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి చేతులు జోడించిన వృద్ధురాలు

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఓ వృద్ధురాలి పట్ల పెద్ద మనసు ప్రదర్శించారు. మచిలీపట్నంలో కాళ్లకు చెప్పులు లేకుండా నడి ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని చూసి ఆయన చలించిపోయారు. ఆమెకు చెప్పులు కొనిచ్చి మానవత్వం చాటుకున్నారు.

ఆ సమయంలో పేర్ని నాని కారులో అటుగా వెళుతున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం పట్ల ఆయన దృష్టిని ఆకర్షించింది. వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలు కనుక్కున్నారు. ఆమె పేదరాలు అని గ్రహించిన పేర్ని నాని, ఆమెను ఓ పాదరక్షల షోరూంకు తీసుకెళ్లి, నచ్చిన చెప్పులు కొనిచ్చారు.

చెప్పులు ఎలా ఉన్నాయమ్మా… లూజుగా ఉన్నాయా… సరిపోయాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి ఆ వృద్ధురాలు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Related posts

బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు

Ram Narayana

తెలంగాణ కొత్త సచివాలయం కింద మినీ రిజర్వాయర్!

Drukpadam

ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే ఐటీ దాడులు.. మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు!

Drukpadam

Leave a Comment