కాంగ్రెస్ సీనియర్లపై ట్రోలింగ్ ఎవరి పని? ఆ నేత ఫిర్యాదుతో బట్టబయలు..!

కాంగ్రెస్ సీనియర్లపై ట్రోలింగ్ ఎవరి పని? ఆ నేత ఫిర్యాదుతో బట్టబయలు..!

  • ఉత్తమ్, వీహెచ్ వంటివారిపై కొన్నిరోజులుగా ట్రోలింగ్ 
  • ట్రోలింగ్ పై పోలీసులకు ఉత్తమ్ ఫిర్యాదు.. 
  • యూత్ కాంగ్రెస్ పేరుతో ఉన్న కార్యాలయం నుండి ట్రోలింగ్!
  • యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్ కు గురైందన్న అనుమానం 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల ట్రోలింగ్ వ్యవహారంలో ట్విస్ట్! సొంత పార్టీ వారే ట్రోలింగ్ చేసినట్లుగా వెలుగు చూసిందని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు తదితర సీనియర్ నేతలపై జోరుగా ట్రోలింగ్ నడుస్తోంది. మే 5వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. తనపై ఓ నెంబర్ నుండి పదేపదే ట్రోలింగ్ జరుగుతోందని అందులో ఉత్తమ్ పేర్కొన్నారు.

పోలీసులు తీగ లాగితే ఉత్తమ్ ఇంటి సమీపంలోని ఫ్లాట్ లో ఉన్న వ్యక్తి ఈ ట్రోలింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. నిన్న పోలీసులు ఆ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించారు. ఆ ఫ్లాట్ యూత్ కాంగ్రెస్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో నుండి ఐదు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.

దీంతో కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతల పైనే ట్రోలింగ్ చేస్తున్నట్లుగా వెలుగు చూసింది. గత కొన్ని రోజులుగా ఉత్తమ్, జానా, వీహెచ్ తదితర నేతలపై ట్రోలింగ్ జరుగుతోంది. ఇదంతా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. చాలా మంది సీనియర్ నేతలు ఇన్ సైడ్ ట్రోలింగ్ బాధితులుగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ ట్రోలింగ్ తో యూత్ కాంగ్రెస్ కు సంబంధం లేదని శివసేన రెడ్డి చెబుతున్నారు. ఎవరు తప్పుడు ట్రోలింగ్ చేశారో పోలీసులే తేల్చాలన్నారు. యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ ను హ్యాక్ చేసినట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: