Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రం అగ్నిగుండం ….పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు 15 మంది మృతి…

రాష్ట్రం అగ్నిగుండం ….పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు 15 వరకు మృతి….
మరో నాలుగైదు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు
అల్లాడుతున్న ప్రజలు
నీళ్లకోసంనీడకోసం పరుగులు తీస్తున్న వైనం
నెత్తిన ఎదో ఒకటి లేకుండా బయటకు వెళ్లలేకపోతున్న జనం
మంచినీళ్లు ,మజ్జిగ కేంద్రాలు పెట్టిన సరిపోవడంలేదు
చెప్పులు లేకుండా తిరగడం దుర్లభం

 

ఇంకా రోహిణి కార్తె రాలేదుఅదిరావడానికి మరో ఐదు,ఆరు రోజులు పడుతుంది.అయినప్పటికీ రాష్ట్ర నిప్పుల కొలిమిగా మారింది. ఇప్పటివరకు 15 మంది తెలుగు రాష్ట్రాల్లో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వడ గాడ్పులుబయట వెళ్ళితే ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదు …. చెప్పులు వేసుకున్న కప్పబడని కాళ్లు నిప్పుల్లో నడుస్తున్నట్లుగా ఉంటున్నాయి. బయటకు వెళ్ళితే ప్రతి ఐదు నిమిషాలకు దాహం తో ప్రజలు అల్లాడి పోతున్నారు. కొందరు దాతలు చలివేంద్రాలు ,మజ్జిగ కేంద్రాలు పెట్టినప్పటికీ అవి సరి పోవడంలేదు . ఇక సీట్ల పానీయాలు గిరాకీ పెరిగింది. కొబ్బరి నీళ్లు , కూల్ డ్రింక్స్ , చెరుకు రసం స్టాల్స్ దగ్గర ప్రజలు క్యూకడుతున్నారు . కొద్దీ నీడకోసం పరుగులు తీస్తున్నారు. తలపై టోపీ లేదా ఎదో ఒక గుడ్డ , టవల్ వేసుకొని కనిపిస్తున్నారు. మహిళలు కొంగు కప్పుకొని లేదా చున్నీలు వేసుకొని ఎండనుంచి తప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు నాలుగు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. అందువల్ల చాలామంది తమ పనులను ఉదయం 10 లోపే పూర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు . రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాలుగా మారాయి…. గ్రామాలు ,పట్టణాలు , నగరాలూ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కర్ఫ్యూ వాతారణం కనిపిస్తుంది. వృద్దులు ఎండలకు తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు . ఇక పశు పక్ష్యాదులు లెక్కలేదునీటికోసం అల్లాడుతున్నాయి. ఖమ్మం లో సోమ , మంగళవారం లలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొత్తగూడెం , భద్రాచలంలో 46 డిగ్రీలు నమోదు అయ్యాయి. అయితే ఇది అధికారులు చెపుతున్న లెక్కలేని వారు చెపుతున్న లెక్కలకన్నా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రోహిణి కార్తెలో ఎండలు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ,రోళ్లలో రోకళ్ళు పగులుతాయని అంటున్నారు ప్రభుత్వం ఉష్ణోగ్రలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి.

Related posts

తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

Drukpadam

నియంత్రణ కోల్పోయి భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్.. సర్వత్రా భయం, భయం!

Drukpadam

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు..

Drukpadam

Leave a Comment