Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి … పువ్వాడ వర్గీయులమధ్య పేలుతున్న మాటల తూటాలు …!

పొంగులేటి ….పువ్వాడ వర్గీయులమధ్య పేలుతున్న మాటల తూటాలు …!
-నువ్వు ఒక తుప్పుపట్టిన గొట్టానివి…నీకు జెండా లేదు
-కేసీఆర్ ను గద్దెదించుతానని సవాల్ చేస్తున్నావు
-జిల్లాలో 10 నియోజకవర్గాలు కాదు … దమ్ముంటే నువ్వే పువ్వాడ అజయ్ పై పోటీచేసి గెలువు
-రైతుల సొమ్ముతో హాస్పటల్ కట్టిన అవినీతి చరిత్ర మువ్వా విజయ్ ది
-అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్న మంత్రి
-గుట్టలు మింగటంలేదా …? రాత్రికి రాత్రి మట్టి ఎక్కడికి పోతుంది.
-కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ ప్రభుత్వ కార్యక్రమం
-అందులో రాజకీయ ప్రసంగాలు
-పొంగులేటి అవినీతి జరిపితే అరెస్ట్ చేయించు …అధికారం నీదే కదా ..?
-సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాలని అంటున్నావు …ప్రభుత్వం నుంచి -రావాల్సిన 1000 కోట్లు డబ్బులు ఇప్పించు…
-తనువూ తాకట్టు పెట్టయినా ఇవ్వాల్సి వస్తే అందరికి పొంగులేటి

పొంగులేటి ,పువ్వాడ వర్గీయుల మధ్య రాజకీయ తూటాలు పేలుతున్నాయి. ఒకరి అవినీతిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు . నువ్వే అవినీతి పరుడవు అంటే నువ్వే అనే నిందలు వేసుకుంటున్నారు. పొంగులేటి పై పువ్వాడ ,పువ్వాడ పై పొంగులేటి జరుగుతున్న మాటల యుద్ధం అనుచరులకు పాకింది. అటు పొంగులేటి వర్గీయులు .ఇటు పువ్వాడ అనుచరులు మంగళవారం ఖమ్మంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు ….
లింగాల కమల్ రాజ్, జెడ్పీ చైర్మన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ …
ఖమ్మంలో కొందరు దిక్కు ముక్కు లేనోల్లు ముఖ్యమంత్రి కేసీఅర్ మీద, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వాళ్లకు చూసి వాళ్ళ అనుచరులు తోక గాల్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మీ స్థాయికి తగదని, మీ స్థాయిని తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది అని హితువు పలికారు. కేసీఅర్ గారిని గద్దె దింపుతాం అని పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని, అసలు మీ వల్ల ప్రజలకు ఒరిగింది.. భవిష్యత్ లో ఒరిగేది ఏమి లేదని గుర్తుంచుకోవాలి అని అన్నారు.
రాజకీయాలు అంటే విలువలు ఉండాలి, నిబద్దత ఉండాలి అని అన్నారు.
జిల్లాలో రాజకీయ చైతన్యం నింపిన పువ్వాడ కుటుంబంకు ఓ చరిత్ర ఉందన్నారు. స్థాయిని మరిచి విమర్శలు చేయడం సిగ్గుచేటని, మా ఓర్పును చేతకాని తనం అనుకుంటే దాని పర్యవసానంగా చవి చూస్తారని హెచ్చరించారు.

కేసీఅర్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 గెలుస్తాం అని స్పష్టం చేశారు..మీ దగ్గర రాజకీయ నిబద్దత లేదు, రాజకీయ ఎజెండా లేదన్నారు. ఎంతో చైతన్యమైన ఖమ్మం జిల్లా మీరు బ్రష్టు పట్టిస్తున్నరని విమర్శించారు. జర్నలిస్ట్ లకు ముఖ్యమంత్రి కేసీఅర్ ఇళ్ళ స్థలాల హామీని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాబినేట్ లో అమొదింప జేశారు. అది చాలా అభినందనీయమైన విషయం. కానీ మీరు దానిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ .. అయ్యా విజయ్ బాబు మీరు బ్యాంక్ చైర్మన్ గా ఉన్న కాలం లో ఏం చేశారో మాకు తెలుసు.. నోరు తేరిస్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి అని అన్నారు…బ్యాంక్ డబ్బులు, రైతుల సొమ్ముతో మీరు విదేశాల్లో భోగాలు అనుభవించి, విలసమైన టూర్లు వేసి ఏం..ఏం చేశావో మాకు తెలుసు. పత్తిత్తు మాటలు ఆపకపోతే మేము కూడా నోరు తెరవల్సి వస్తుంది.. జాగ్రత్త అని హెచ్చరించారు..

అడ్రెస్స్ లేని మీ నాయకుడిని చూసి చంకలు గుద్దుకొకంది.. మీ బాగోతం.. మీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి బాగోతం అన్ని బయట పెడతామన్నరు.
నాణ్యతలోపం తో కాంట్రాక్ట్ లు చేసి, ముఖ్యమంత్రి కేసీఅర్ ని అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించి అనుభవిస్తున్న వు అది కేసీఅర్ గారి దయవల్లే అని గుర్తుంచుకోవాలన్నారు . మీడియా సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , నగర బీఆర్ యస్ అధ్యక్షలు పగడాల నాగరాజు , కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ , కమర్తపు మురళి , షేక్ మగబ్బుల్ తదితరులు పాల్గొన్నారు .

పొంగులేటి వర్గీయుల మీడియా సమావేశం ..

పువ్వాడకు పూనకం ….అందుకే అర్థంలేని మాటలు …
– ఖమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంతో ఆందోళన
– అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఏమేమో మాట్లాడుతున్నాడు
– పార్టీలో ఉన్నప్పుడు అక్రమ సంపాదనపై ఎందుకు మాట్లాడలేదు
– నీ పక్కన ఉన్న కట్టప్పల గురించి ఆలోచించుకో
– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు మువ్వా, స్వర్ణకుమారి, నగేశ్ యాదవ్

ఖమ్మంలో పొంగులేటి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం చూసి పువ్వాడ అజయ్ కుమార్ కు పూనకం వచ్చిందని, వచ్చిన జనసందోహాన్ని చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఏమేమో మాట్లాడుతున్నాడని పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ బాబు ఫైర్ అయ్యాడు. మంగళవారం శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మువ్వా మాట్లాడుతూ.. పొంగులేటి అడగడం వల్లే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని, ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను మాత్రం పొంగులేటి తీసుకుంటాడని తెలిపారు. 30 ఏళ్ల పాటు కాంట్రాక్టర్ గా కష్టపడ్డ పొంగులేటి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడని… కూనవరంలో దేంతో మీ ప్రస్థానం మొదలైంది.. ఖమ్మంలో కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాల్సిన అవసరం మీకుందని పువ్వాడను ప్రశ్నించారు. పొంగులేటి అక్రమంగా సంపాదించాడని ఇప్పుడు మాట్లాడుతున్న మీరు.. మీ పార్టీలో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుకురాలేదా? అని నిలదీశారు. కొత్త బస్టాండ్ నిర్మాణ వ్యయాలేంటి?, గోళ్లపాడు ఛానల్ ద్వారా దండుకున్నదెంత? అందరికీ తెలుసన్నారు. బైరటీస్ అక్రమ వ్యవహారంపై త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. డీసీసీబీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్నింటికి లెక్కలున్నాయని వెల్లడించారు. ఈ విషయమై అష్టలక్ష్మీ గుడి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధం.. నీవు సిద్ధమా అంటూ పువ్వాడకు సవాల్ విసిరారు. పార్టీ ఆఫీసులో నీ ఫొటో తీసేశారని, మొదట నీ పక్కన ఉన్న కట్టప్పల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నీ ఓటమి తప్పదు గుర్తుంచుకో అంటూ మువ్వా ఫైర్ అయ్యాడు. మద్దినేని బేబీ స్వర్ణకుమారి మాట్లాడుతూ పువ్వాడ నాగేశ్వరరావు పేరు చెడగొట్టొద్దని మంత్రి అజయ్ కుమార్ కు సూచించారు శ్రీనివాస రెడ్డి పై ఆరోపణలు మానుకొని ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్పొరేటర్ దొడ్డా నగేశ్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పువ్వాడపై పోటీచేసి గెలిచే బచ్చాను నేనే అని, అనవసరమైన మాటలతో కాలయాపన చేయకుండా పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మందడపు తిరుమల రావు, బోడా శ్రావణ్, మియా భాయ్, దుంపల రవి కుమార్, మందడపు నాగేశ్వరరావు , దుర్గా, నాగరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.

Related posts

తుమ్మల హంగామా …దేనికి సంకేతం..!

Drukpadam

నోటీసులకు భయపడను: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్….

Drukpadam

సంచలనంగా మారిన షర్మిల నిర్ణయం …చైత్ర ఇంటిముందే దీక్ష!

Drukpadam

Leave a Comment