కోమటిరెడ్డి లో మార్పు రావడం సంతోషకరం …విహెచ్ ..

కాంగ్రెస్ పై వ్యతిరేకతతో ఉన్న కోమటిరెడ్డిలో మార్పు వచ్చింది.. సంతోషంగా ఉంది: వీహెచ్

  • మొన్నటి వరకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో కోమటిరెడ్డి ఉన్నారన్న వీహెచ్
  • హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల తర్వాత మనసు మారిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ నేతలంతా కలసికట్టుగా పని చేయాలని విన్నపం

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక భావజాలంతో ఉన్న కోమటిరెడ్డిలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల తర్వాత ఆయన మనసు మారిందని చెప్పారు. ఆయనలో మార్పు రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. కోమటిరెడ్డి ఏ యాత్ర చేపట్టినా పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకుంటేనే బాగుంటుందనేది తన ఉద్దేశమని తెలిపారు.

ప్రజల్లో ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంటుందని… అయితే కాంగ్రెస్ నాయకులంతా కలసికట్టుగా పని చేస్తేనే అధికారం వస్తుందని వీహెచ్ అన్నారు. మనలోమనకు ఉన్న మనస్పర్థలను తగ్గించుకుని కలసి పని చేస్తే బాగుంటుందని చెప్పారు. చిన్నచిన్న బేదాభిప్రాయాలను అందరూ మర్చిపోవాలని సూచించారు. ప్రజలు, కార్యకర్తల బాధలను తెలుసుకుని, వారి కోసం పని చేయాలని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: