కెనడాలో నెల రోజుల క్రితం ఏపీ విద్యార్థి మిస్సింగ్.. మిస్టరీగా మారిన కేసు!

కెనడాలో నెల రోజుల క్రితం ఏపీ విద్యార్థి మిస్సింగ్.. మిస్టరీగా మారిన కేసు!

  • కెనడాలో చదువుకుంటున్న సత్తెనపల్లి విద్యార్థి నిడమనూరి శ్రీధర్
  • ఏప్రిల్ 21న అదృశ్యమైన యువకుడు
  • నెల దాటిపోతున్నా ఇప్పటికీ లభించని ఆచూకీ
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోసం తల్లిదండ్రుల అభ్యర్థన

కెనడాలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థి నిడమనూరి శ్రీధర్ అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనకు చెందిన శ్రీధర్ ఏప్రిల్ 21న కెనడాలో కనిపించకుండా పోయాడు. అతడి జాడ తెలీక నెల రోజులు దాటిపోయింది. ఇప్పటికీ శ్రీధర్ ఆచూకీ లభించలేదు.

దీంతో, తమ కుమారుడు ఏమయ్యాడో తెలీక అతడి తల్లిదండ్రులు సీతారామయ్య, వెంకటరమణ తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

%d bloggers like this: