Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీతో ఇక తెగదెంపులేనా …?

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా …?
-టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు …
-పార్టీలతో సంబంధం లేదు.. ఎవరితోనైనా కలిసి పని చేస్తానని వెల్లడి
-టీడీపీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని వ్యాఖ్య
-ఇండిపెండెంట్ గా అయినా పోటీకి సిద్ధమని ప్రకటన
-మనస్తత్వానికి సరిపోతుందనుకుంటే ఏ పార్టీ అయినా ఓకే అన్న నాని

రాజమండ్రి లో మహానాడు పెట్టి మంచి ఊపు మీద ఉన్న టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని గట్టి షాక్ ఇవ్వనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతంగా ట్రోల్ అవుతుంది.
ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా …? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …ఆయన గత కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు .ఇటీవల రాజమండ్రి లో జరిగిన మహానాడుకు కూడా ఆయన వెళ్లినట్లు లేదు …పార్టీ తనకు వ్యతిరేకంగా వేరేవారిని ప్రోత్సహించడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయినప్పటికీ రెండు మూడు సందర్భాలలో అది నేత చంద్రబాబును కలిశారు . కానీ ఇటీవల కాలంలో గ్యాప్ బాగా ఏర్పడింది. అందువల్ల ఆయన టీడీపీ నేతలు ఎవరు లేకుండానే తన పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు . తనకు అనుయులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో వేదికలు పంచుకుంటున్నారు .దీనిపై ఆయన స్పందిస్తూ తన ఆలోచనలకు తగ్గట్లు ఉండే పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించడం సంచలనంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందించారు. ఎంపీగా టీడీపీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు తనను మరోసారి కోరుకుంటే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

తన వ్యాఖ్యలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. అభివృద్ధి విషయంలో తనకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరితోనైనా కలిసి పని చేస్తానన్నారు. తన మనస్తత్వానికి సరిపోతుందనుకుంటే ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదన్నారు. అందువల్ల ఆయన వైసీపీలో చేరుతున్నారా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆయన స్పందించనప్పటికీ ఆయన టీడీపీ నుంచి ఈసారి పోటీచేయడంలేదనేది నిర్దారణ అయింది …

Related posts

విలేకరులపై నోరు పారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే కాపు …

Drukpadam

హ‌క్కుల కోసం స‌ర్పంచ్‌లు పోరాడాలి: చంద్ర‌బాబు…

Drukpadam

మోదీని కలవడానికి కారణం ఇదే: జగన్

Drukpadam

Leave a Comment