Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు…సింవాహ లోకనం..!

తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళుసింవాహ లోకనం…!
దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం సన్నద్ధం
21 రోజులపాటు రాష్ట్రమంతటా సంబరాలు
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న కేసీఆర్
గోల్కొండ కోటాలో ఉత్సవాలకు బీజేపీ ఏర్పాట్లు
గాంధీ భవనంలో కాంగ్రెస్ కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పుడే పది సంవత్సరాలు అయింది. దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం ముస్తాబైందిరాష్ట్రం ఏర్పడిన చారిత్రిక సందర్భాన్ని పురస్కరించుకొని గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమర వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు . బీజేపీ గోల్కొండ కోటాలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు . గాంధీ భవనంలో కాంగ్రెస్ కార్యక్రమాలు తలపెట్టింది. సందర్భంగా తెలంగాణ ఉద్యమాలు తదనంతర పరిణామాలపై ఒకసారి సింవాహ లోకనం చేసుకోవసి ఉంది….

తోలి దాదా మలి ఉద్యమాలు అంతకు ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ , ప్రొఫెసర్ జయశంకర్ లాంటి అనేక మంది మేధావుల ఆలోచనలు ఫలితంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉద్యమాల ఫలితంగా సాకారమైంది. ఒకరు కాదు ,ఇద్దరు కాదు 12 వందల మంది విద్యార్ధి ,యువకుల ప్రాణాలు కోల్పోయారు . లక్షలాది మంది అరెస్టు అయ్యారు . జైళ్లకు వెళ్లారు .చివరకు జర్నలిస్టుల కెమెరాలు ధ్వంసం అయ్యాయి. వీపులు పగిలాయి. తెలంగాణ రాష్ట్రంకోసం కుడు నీళ్లు మాని ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లిన అనేక మంది తెరమరుగైయ్యారు .  సబ్బండ వర్గాలు జై తెలంగాణ అని నినదించాయి. రాష్ట్రంలో ఉన్న ఎక్కడి వాడైనా జై తెలంగాణ అనకపోతే బతుకు లేదని భావించారు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినాదం మార్మోగింది. పార్లమెంట్ ను కుదిపేసిందిఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందితెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మానియా విద్యార్ధి శ్రీకాంత చారి మంటల్లో కాలిపోయారు . అది రాష్ట్రంలోని ప్రజానీకాన్ని కదిలించింది.తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకుండా , ఉద్యమాన్ని అణచాలని చూసిన నేతలు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండటంపై ఉద్యమకారులు రగిలి పోతున్నారు

మలి దశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి , అన్ని రాజకీయ పార్టీల ఆధ్వరంలో ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్ గా ఏర్పాటు అయిన జాయింట్ యాక్షన్ కమిటీ , నడిపిన ఉద్యమాలు, కళాకారుల పాటలు మాటలు తెలంగాణ సమాజాన్ని ఉర్రుతలూగించాయి. సకల జనుల సమ్మె , మిలియన్ మార్చ్ లాంటి మిలిటెంట్ ఉద్యమాలు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రధానంగా యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కదిలించాయి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దేశంలోని రాజకీయ పార్టీలను కూడ గట్టడంలో కేసీఆర్ వ్యూహరచన ఫలించింది. చివరకు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2 తారీఖున అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది . నాడు తెలంగాణ అంతటా సంబరాలు మిన్నంటాయి. విద్యుత్ దీపాలతో తెలంగాణ రాష్ట్రం వెలిగి పోయింది. అన్ని ప్రభుత్వం కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి.

2014 ఎన్నికల్లో టీఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు . తానే సీఎం పీఠం పై కూర్చున్నారు . బంగారు తెలంగాణ చేస్తామన్నారు . దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు . అది అమలుకు నోచుకోలేదునిధులు , నీళ్లు , నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కల సాకారం కాలేదు .. నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న తగాదాకు తెరపడలేదునిధుల విషయంలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు ఉన్నాయి. పేదోడి సొంత ఇంటి కల నెరవేర లేదుడబుల్ బెడ్ రూంలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రైతు బంధు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు .చివరకు రైతులు కూడ పథకంలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తున్నారు . భూ సీలింగ్ చట్టం బుట్ట దాఖలైంది . ఎన్ని ఎకరాలు భూమి ఉన్నా, రైతు బంధు ఇవ్వడం పై విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు , ఇన్ కం టాక్స్ పెయర్లకు, వందలు ఎకరాలు ఉన్నవారికి , రైతు బంధు ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయి. మిషన్ కాకతీయ కొంత వరకు సక్సెస్ అయినా , మిషన్ భగీరథ లోపభూష్టంగా ఉందనే విమర్శలు ఉన్నాయి.గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు ఇచ్చినా వాటి మెయింటెనెన్స్ లేదుపంచాయతీలకు నిధులు లేక సర్పంచులు చేసిన పనులకు నిధులు రాక ఆలోలక్షణా అంటున్నారు . వాగ్దానం చేసిన విధంగా లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయలేదని రైతులు ఆగ్రహంగా ఉన్నారు . నిరుద్యోగుల భృతి ఇవ్వలేదుఉద్యోగాల కల్పనలో పేపర్ లీకేజ్ , 10 తరగతి పరీక్షల్లో పేపర్ లీకులు ప్రభుత్వానికి మచ్చతెచ్చి పెట్టాయి. దళిత బంధు అమల్లో ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు . ధరణి పోర్టల్ పై అభ్యంతరాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు మొత్తు కుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నత్తనడక సాగుతుంది. జిల్లాల ఏర్పాటు , మండలాల ఏర్పాటు లో శాస్త్రీయత లోపించిందని విమర్శలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ వయస్సు పెంపుదల , నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం ,ఉద్యోగులకు , పెన్షనర్లకు , జీతాలు సకాలంలో చెల్లించకపోవడం ,డి లు ఇవ్వక పోవడం పెంచిన పీఆర్సీ బకాయిలు పెండింగ్ లో ఉంచడం , కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయకపోవడం లాంటి సమస్యలు ప్రభుత్వానికి ఉరి తాళ్ళుగా మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత వైద్యం: స్టాలిన్

Drukpadam

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ఇంకా 9194 ఎలక్ట్రోల్ కాలేజీ ఓట్లు అవసరం!

Drukpadam

‘అఖండ భారతం’ కల త్వరలోనే సాకారం: మోహన్ భగవత్!

Drukpadam

Leave a Comment