Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేరళ మళ్లీ ఎల్ డి ఎఫ్ దే…

కేరళ మళ్లీ ఎల్ డి ఎఫ్ దే…
-పినరయి విజయన్ పాలనా భేష్
-కరోనా కాలంలో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వంగా కితాబు
-లెఫ్ట్ కు తిరుగులేదు
-కాంగ్రెస్ రెండవ స్థానమే
-బీజేపీ కి సీన్ లేదు
కేరళలో ప్రజారంజక పాలనా అందించటం ద్వారా పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రానున్నదని సర్వేలు తెలుపుతున్నాయి . కేరళ రాష్ట్రంలో గత 40 సంవత్సరాలుగా ఎల్ డి ఎఫ్ లేదా యూ డి ఎఫ్ లు ప్రతి ఐదుసంవత్సరాలకు మారుతూ అధికారంలోకి వస్తుంటాయి. ఎవరు కూడా రెండవ సారి అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. కేరళ ప్రజలు కూడా అధికారం ఒకే కూటమికి రెండు టర్ములు ఇచ్చిన సందర్భాలు లేవు . కానీ ఈ సారి పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్ డి ఎఫ్ కు అధికారం తిరిగి కట్ట బెట్ట బోతున్నట్లు సర్వేల సారాంశం . ఎ బి పి , సి ఓటర్ సర్వే లో అనేక విషయాలపై ప్రజల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఎల్ డి ఎఫ్ తిరిగి అధికారంలో కి వస్తున్నట్లు వెల్లడైంది. వార్ వన్ సైడ్ అంటూ సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల లో కూడా ఆ సంస్థ సర్వే చేయటం జరిగింది . కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉండగా ఎల్ డి ఎఫ్ కు 83 నుంచి 91 కాంగ్రెస్ నాయకత్వంలోని యూ డి ఎఫ్ కు 47 నుంచి 55 సీట్లు రానున్నట్లు సర్వే తెలిపింది. యూ డి ఎఫ్ కు 2016 లో 47 సీట్లు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని అనుకున్న బీజేపీ ఆశలు నెరవేరేట్లు లేదు. మెట్రో మ్యాన్ శ్రీధరన్ తో పాటు అనేక మంది బీజేపీలో చేరారు. రాష్ట్రం లో బీజేపీని అధికారంలోకి తేవడం లక్ష్యం అని వృద్ధ నేత శ్రీధరన్ అన్నారు. అయినప్పటికీ బీజేపీకి కేరళ ప్రజలనుంచి ఆదరణ లభించే ఆవకాశాలు కనిపించటం లేదు. అయ్యప్ప స్వామి ఆలయ సెంటిమెంట్ తో కేరళ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చు అని అనుకున్నప్పటికీ అదికూడా వర్క్ అవుట్ అయ్యేట్లు లేదు. కరోనా సమయం లో ప్రభుత్వం రేషన్ కిట్లు పంపిణీ చేయటంపై ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే 2016 కన్నా అన్ని పార్టీలకు ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంది. అప్పటికన్న ఎల్ డి ఎఫ్ కు 3 .4 శాతం , యూ డి ఎఫ్ కు 6 .2 శాతం , బీజేపీకి 2 శాతం ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

సర్వేలో ఎల్ డి ఎఫ్ కు స్పష్టమైన మోజార్టీ వస్తుందని తెలపటంతో పాటు బీజేపీ కి భంగపాటు తప్పదని తెలియటంతో కమలనాథుల్లో కంగారు మొదలైందని తెలుస్తుంది.

Related posts

కేజ్రీవాల్ రోడ్ షో లో ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు!

Drukpadam

పవన్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం మాకు లేదు..పేర్ని నాని!

Drukpadam

అమిత్ షా జీ, మీరు జోక్యం చేసుకోండి: ఖర్గే

Drukpadam

Leave a Comment