Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దుర్మరణం !

హెలికాప్టర్ లోని 14 మందిలో బిపిన్ రావత్ తోసహా 14 మంది దుర్మరణం..
-తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
-మంటల్లో ఆహుతి అయిన ప్రయాణికులు
-బిపిన్ రావత్ ను ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం

తమిళనాడు లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణించారు. ఇది దేశాన్ని దుఃఖ సాగరంలో ముంచింది. కేంద్రప్రభుత్వం షాక్ కు గురైంది. అత్యంత భద్రతా గల వివిఐపి లు ప్రయాణించే హెలికాఫ్టర్ ప్రమాదానికి గురికావడం అధికార యంత్రాంగాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.

ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు .అందులో ఏ ఒక్కరు మిగలలేదు . అందరు మరణించారు .

 

తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తుతోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఊటీ ప్రాంతంలోని కూనూరు ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నవారు మంటల్లో కాలిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టనంతగా కాలిపోయాయి. మొత్తం 14 మంది హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 14 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. రావత్ సతీమణి మృతి చెందినట్టు తొలుతే వార్తలు వచ్చాయి. అయితే ముందు 13 మంది చనిపోయారని అందులో బిపిన్ రావత్ మాత్రం గాయాలతో బయట పడ్డారని వార్తలు వచ్చాయి. కానీ కొద్దీ సేపటి క్రితం బిపిన్ రావత్ మరణించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు ప్రమాదం సంభవించిన తర్వాత బిపిన్ రావత్ ను అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి. కాలిన శరీరంతో ఒంటిపై బట్టలు లేకుండా ఆయన ఉన్నారు (కాలిపోతున్న దుస్తులను బహుశా ఆయనే తొలగించి ఉండొచ్చు). బిపిన్ రావత్ ను హుటాహుటిన వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించారు .80 శాతం కాలిన గాయాలతో ఉన్న రావత్ మరణించడం దురద్రష్టకరం .

ప్రాణాలతో ఉన్న వ్యక్తి బిపిన్ రావతే కావచ్చని.. ఆయన ప్రాణాలతో బయటపడాలని యావత్ దేశం కోరుకుంటోంది. అయితే ఆ 14వ వ్యక్తి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించనున్నట్టు తెలుస్తోంది. అందులో రావత్ భార్య కూడా ఉన్నారు. కానీ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా బిపిన్ రావత్ ను కాపాడలేక పోయారు .

Related posts

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ జయభేరి… బీజేపీ 15 ఏళ్ల పాలనకు ముగింపు!

Drukpadam

తెలంగాణ లో సిపిఐ గుర్తు కంకి కొడవలి కొనసాగుతుంది…కూనంనేని…

Drukpadam

అత్యంత రహస్యంగా భారత్ లో ల్యాండ్ అయిన చైనా విదేశాంగ శాఖ మంత్రి!

Drukpadam

Leave a Comment