Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పంజాబ్ లో మరో ఘటన… నిషాన్ సాహిబ్ ను అపవిత్రం చేశాడంటూ వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు!

పంజాబ్ లో మరో ఘటన… నిషాన్ సాహిబ్ ను అపవిత్రం చేశాడంటూ వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు!

  • గతరాత్రి అమృత్ సర్ లో ఓ వ్యక్తి బీభత్సం
  • కొట్టి చంపిన భక్తులు
  • ఈ ఉదయం మరో ఘటన 
  • కపుర్తలా జిల్లాలో ఓ గురుద్వారాలో ప్రవేశించిన వ్యక్తి 

సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో గతరాత్రి ఓ వ్యక్తిని కొట్టి చంపడం తెలిసిందే. గర్భగుడిలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించిన ఆ యువకుడిపై భక్తులు ఒక్కసారిగా దాడి చేసి హతమర్చారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పంజాబ్ లో అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది.

కపుర్తలా జిల్లాలోని నిజాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి గురుద్వారాలో చొరబడినట్టు గ్రామస్తులు గుర్తించారు. సిక్కుల పవిత్ర పతాకం నిషాన్ సాహిబ్ ను అతడు అపవిత్రం చేస్తూ వారి కంటబడ్డాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిక్కు సంఘాలు మాత్రం అతడిని తమ ఎదుటే విచారించాలని పట్టుబట్టాయి.

అయితే అతడిని అక్కడినుంచి తరలించే యత్నంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై గ్రామస్తులు దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. అమృత్ సర్ లో ఘటన జరిగిన 24 గంటల్లోపే మరో ఘటన జరగడంతో పంజాబ్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related posts

ఎంఎస్ ధోనీపై పరువునష్టం కేసు నమోదు.. రేపు విచారణ

Ram Narayana

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్

Ram Narayana

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, కుమారుడిపైన చిత్రహింస లకు పాల్పడిన ఘటనపైన న్యాయ విచారణ జరపాలి…

Drukpadam

Leave a Comment