Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మేం ఏం చేయాలో చెప్పడానికి నువ్వేమీ మా వ్యూహకర్తవి కాదు: పవన్ కల్యాణ్ పై కొడాలి నాని ఫైర్!

మేం ఏం చేయాలో చెప్పడానికి నువ్వేమీ మా వ్యూహకర్తవి కాదు: పవన్ కల్యాణ్ పై కొడాలి నాని ఫైర్!
-స్టీల్ ప్లాంట్ అంశంలో జనసేన వర్సెస్ వైసీపీ
-వైసీపీ ఎంపీలు కనీసం ప్లకార్డులైనా పట్టుకోవడంలేదన్న పవన్
-పవన్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ కొడాలి నాని విమర్శలు
-పవన్ సలహాలు ఎవరికి కావాలంటూ ఆగ్రహం

ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సలహాలు తమకు అవసరంలేదన్నారు.

ప్రాణత్యాగాలు చేసైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు చెప్పారని, వారు అంత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, కనీసం ప్లకార్డులు పట్టుకుంటే చాలని పవన్ నేడు వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొడాలి నాని… స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేయాలో చెప్పడానికి పవన్ కల్యాణ్ ఏమీ తమ వ్యూహకర్త కాదని అన్నారు. తమకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఉన్నారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ ఆ సలహాలేవో దత్తత తండ్రి చంద్రబాబుకో, లేక బీజేపీకో ఇచ్చుకోవాలని సూచించారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో తాము చేసేది చేస్తామని, అసలు పవన్ కల్యాణ్ ఏంచేస్తాడో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు. అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాల్సిన బాధ్యత కేంద్రానిదని, పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ఇచ్చే సలహాలు ఎవరికి కావాలని ప్రశ్నించారు.

నారా భువనేశ్వరి చెప్పింది నిజమే… ఎవరి పాపాన వాళ్లే పోతారు: మంత్రి కొడాలి నాని
తిరుపతిలో భువనేశ్వరి వ్యాఖ్యలు
పాపాత్ములు అనిపించుకోవద్దంటూ హితవు
స్పందించిన మంత్రి కొడాలి నాని
ఆమె వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయని వివరణ

తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి చెప్పింది నిజమేనని, చెడు వ్యాఖ్యలు చేసినవాళ్లు ఎవరి పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయని అన్నారు.

భార్య పేరును రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకే చెల్లుతుందని, ఆమె శాపం బాబుకు తప్పకుండా తగులుతుందని తెలిపారు. ఆడవాళ్లను రోడ్డుమీదికి తెచ్చింది ఎవరు? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆడవాళ్ల ఉసురుతగలడం ఖాయమని, వచ్చే ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా పోతుందని జోస్యం చెప్పారు.

Related posts

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన లోక్ సభ సచివాలయం!

Drukpadam

విశాఖ కోసం రాజీనామా చేస్తానన్న ధర్మాన…. వద్దని వారించిన సీఎం జగన్!

Drukpadam

అసెంబ్లీ అభ్యర్థులపై బీఆర్ యస్ లీకులు …కరీంనగర్ లోకసభకు అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్ …

Drukpadam

Leave a Comment