Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాకు బెదిరింపులు.. రూ. 2.5 కోట్ల డిమాండ్!

కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాకు బెదిరింపులు.. రూ. 2.5 కోట్ల డిమాండ్!
-ఆ వీడియోలు బయటపెడతామంటూ బ్లాక్ మెయిలింగ్
-పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి
-లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా మంత్రి కుమారుడు
-నాటి ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మృతి
-ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తమ వద్ద ఉన్నాయని బెదిరింపులు
-అరెస్ట్ చేసిన పోలీసులు

అక్టోబరు 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది చనిపోయారు. రైతులపైకి దూసుకెళ్లిన ఆ వాహనం నడిపింది కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధిన వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 2.5 కోట్లు ఇవ్వాలంటూ కొందరు వ్యక్తులు తనను ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు మంత్రి ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 17న తనకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అడిగిన మొత్తం ఇవ్వకుంటే తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను బయటపెడతామని బెదిరించినట్టు ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా మంత్రికి వారు ఈ కాల్స్ చేసినట్టు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు గ్రాడ్యుయేషన్ చదువుతున్నట్టు చెప్పారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

Related posts

రాజీనామా లేఖలో.. ‘మా’ స‌భ్యుల‌పై నాగ‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు…

Drukpadam

ఇద్దరినీ కలిపింది …సినిమా టికెట్స్ వివాదం…

Drukpadam

ఇది పవన్ క‌ల్యాణ్ పై దాడి కాదు… థియేటర్ల వ్యవస్థపై దాడి:ఎన్వీ ప్రసాద్

Drukpadam

Leave a Comment